Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Semiya Tomato Dosa : సేమియా, ట‌మాటాలతో దోశ‌ల‌ను ఇలా చేయండి.. సూప‌ర్‌గా ఉంటాయి..!

D by D
September 21, 2023
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Semiya Tomato Dosa : మ‌నం సేమియాతో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాము. సేమియాతో చేసే వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు చాలా సుల‌భంగా, చాలా త‌క్కువ సమ‌యంలో ఈ వంట‌కాల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. సేమియాతో త‌రుచూ చేసే వంట‌కాల‌తో పాటు కింద చెప్పిన విధంగా దోశ‌ల‌ను కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. సేమియా, ట‌మాటాలు క‌లిపి చేసే ఈ దోశ‌లు క్రిస్పీగా, చాలా రుచిగా ఉంటాయి. వీటిని అప్ప‌టిక‌ప్పుడు చాలా సుల‌భంగా తయారు చేసుకోవ‌చ్చు. త‌రుచూ ఒకేర‌కం టిఫిన్స్ తిని బోర్ కొట్టిన వారు ఉద‌యం పూట స‌మ‌యం తక్కువ‌గా ఉన్న‌వారు ఈ దోశ‌ల‌ను త‌యారుచేసుకుని తిన‌వ‌చ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ సేమియా ట‌మాట దోశ‌ల‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

సేమియా ట‌మాట దోశ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

సేమియా – అర క‌ప్పు, బొంబాయి ర‌వ్వ – అర క‌ప్పు, ట‌మాటాలు – 3, ఎండుమిర్చి – 3, అల్లం – అర ఇంచు ముక్క‌, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ – 1, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, ఉప్పు – త‌గినంత‌,నీళ్లు – త‌గిన‌న్ని, గోధుమ‌పిండి – ఒక టేబుల్ స్పూన్.

Semiya Tomato Dosa recipe in telugu make like this
Semiya Tomato Dosa

సేమియా ట‌మాట దోశ త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో సేమియాను వేసి దోర‌గా వేయించి గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత అదే క‌ళాయిలో ర‌వ్వ వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత మ‌ర‌లా అదే క‌ళాయిలో ఎండ‌మిర్చి కూడా వేసి దోర‌గా వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఒక జార్ లో ఎండుమిర్చి, ర‌వ్వ‌, అల్లం, జీల‌క‌ర్ర, ట‌మాట ముక్క‌లు వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకుని గిన్నెలో వేసుకోవాలి. ఇందులోనే వేయించిన సేమ్యాతో పాటు మిగిలిన ప‌దార్థాల‌న్నీ వేసి బాగా క‌ల‌పాలి. త‌రువాత త‌గినన్ని నీళ్లు పోసి క‌లిపి అర‌గంట పాటు నాన‌బెట్టాలి. ఇలా నాన‌బెట్టిన త‌రువాత త‌గిన‌న్ని నీళ్లు పోసి ర‌వ్వదోశ మాదిరి పిండిని క‌లుపుకోవాలి.

ఇప్పుడు స్ట‌వ్ మీద పెనాని ఉంచి వేడి చేయాలి. పెనం వేడ‌య్యాక నూనె వేసి టిష్యూతో లేదా ఉల్లిపాయ‌తో తుడ‌వాలి. తరువాత గంటెతో పిండిని తీసుకుని ర‌వ్వ దోశ మాదిరి ప‌లుచ‌గా వేసుకోవాలి. దోశ త‌డి ఆరిన త‌రువాత నూనె వేసి కాల్చుకోవాలి. దోశ ఒక‌వైపు కాలిన త‌రువాత మ‌రో వైపుకు తిప్పుకుని కాల్చుకోవాలి. ఇలా దోశ‌ను రెండు వైపులా కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే సేమియా ట‌మాట దోశ త‌యార‌వుతుంది. దీనిని చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా సేమియాతో చేసిన దోశ‌ల‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Tags: Semiya Tomato Dosa
Previous Post

Masala Pappu : మ‌సాలా ప‌ప్పును ఇలా చేయండి.. అన్నంలో నెయ్యితో క‌లిపి వేడిగా తింటే ఎంతో బాగుంటుంది..!

Next Post

Garlic : నెల రోజుల పాటు రోజూ రెండు వెల్లుల్లి రెబ్బ‌ల‌ను తింటే.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Related Posts

వినోదం

సూప‌ర్ స్టార్ కృష్ణ ఆర్థికంగా ఎంత న‌ష్ట‌పోయారో తెలుసా..?

May 9, 2025
politics

అతి తెలివి చూపిస్తున్న పాకిస్తాన్.. భార‌త్ ముందు ఫ‌లించేనా..?

May 9, 2025
inspiration

జీవితంపై విర‌క్తి క‌లిగిన ఓ అమ్మాయికి త‌న తండ్రి చెప్పిన మాట‌లు.. ఆలోచించాల్సిందే..

May 9, 2025
హెల్త్ టిప్స్

దిండును కౌగిలించుకుని ప‌డుకుంటే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

May 8, 2025
చిట్కాలు

గ్యాస్, అసిడిటీ, అజీర్ణం సమస్యలను క్షణాల్లోనే ఎలా తగ్గించుకోవచ్చో తెలుసుకోండి..!

May 8, 2025
mythology

క్షీర‌సాగ‌ర మ‌థ‌నంలో విషం, అమృత‌మే కాదు… ఇవి కూడా ఉద్భ‌వించాయి..!

May 8, 2025

POPULAR POSTS

food

Filter Coffee : హోట‌ల్స్ లో ల‌భించే ఫిల్ట‌ర్ కాఫీని ఇంట్లోనే ఇలా సుల‌భంగా చేసుకోవ‌చ్చు..!

by D
May 21, 2023

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Chia Seeds In Telugu : చియా విత్త‌నాల‌కు చెందిన ఆరోగ్య ర‌హ‌స్యాలు..!

by Admin
July 23, 2024

...

Read more
మొక్క‌లు

Vavilaku : శ‌రీరంలోని అన్ని ర‌కాల నొప్పులు, వాపుల‌కు ప‌నిచేసే వావిలి ఆకులు.. ఎలా ఉప‌యోగించాలంటే..?

by D
May 16, 2022

...

Read more
కూర‌గాయ‌లు

Beerakaya : బీర‌కాయ‌ల‌ను తింటున్నారా.. అయితే ఈ విషయాల‌ను తెలుసుకోవాల్సిందే..!

by D
March 22, 2023

...

Read more
politics

నెట్ లో వైరల్ అవుతున్న చంద్రబాబు పెళ్లిపత్రిక చూసారా ? అప్పట్లో ఎంత కట్నం తీసుకున్నారంటే ?

by Admin
May 8, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Pichukalu : పిచ్చుక‌లు ఇంట్లోకి ప‌దే ప‌దే వ‌స్తున్నాయా.. దాని అర్థం ఏమిటో తెలుసా..?

by D
November 7, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.