Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Street Style Sherwa : హోట‌ల్స్‌లో ఇచ్చే బిర్యానీ షేర్వాను ఇలా చేయండి.. చ‌పాతీల్లోకి కూడా బాగుంటుంది..!

D by D
September 19, 2023
in food, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Street Style Sherwa : మ‌న‌కు రోడ్ల ప‌క్క‌ను హోటల్స్ లో, ధాబాల‌ల్లో ప‌రాటాలల్లోకి స‌ర్వ్ చేసే వాటిల్లో షేర్వా కూడా ఒక‌టి. పరాటాల‌ను షేర్వాతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ఈ షేర్వాను రుచి చూసే ఉంటారు. ప‌రాటాల‌ను షేర్వాతో తింటే ఎన్ని తినారో కూడా తెలియ‌కుండా తినేస్తార‌ని చెప్ప‌వ‌చ్చు. ఈ షేర్వాను అదే రుచితో మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. ప‌రాటాల‌ల్లోకి త‌రుచూ పెరుగు రైతానే కాకుండా ఇలా వెరైటీగా కూడా ట్రై చేసుకుని తిన‌వ‌చ్చు. షేర్వాను స్ట్రీట్ స్టైల్ లో ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

స్ట్రీట్ స్టైల్ షేర్వా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

ఎండు కొబ్బ‌రి ముక్క‌లు – పావు క‌ప్పు, జీడిప‌ప్పు – 15, సోంపు గింజ‌లు – ఒక టీ స్పూన్, గ‌స‌గ‌సాలు – ఒక టీ స్పూన్, నూనె – 4 టేబుల్ స్పూన్స్, అనాస పువ్వు – 1, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, ఎండుమిర్చి – 1, బిర్యానీ ఆకు – 1, మిరియాలు – 4, యాల‌క్కాయ – 1, ల‌వంగాలు – 2, స‌న్న‌గా త‌రిగిన ఉల్లిపాయ – 1, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, త‌రిగిన బంగాళాదుంప – 1, త‌రిగిన కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్స్, త‌రిగిన పుదీనా – 2 టేబుల్ స్పూన్స్, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, జీల‌క‌ర్ర పొడి – అర టీ స్పూన్, ప‌సుపు – పావు టీ స్పూన్, కారం – 2 టీ స్పూన్స్, గ‌రం మ‌సాలా – ఒక టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, ట‌మాటాలు – పెద్ద‌వి రెండు, నీళ్లు – 650 ఎమ్ ఎల్.

Street Style Sherwa recipe in telugu make like this
Street Style Sherwa

స్ట్రీట్ స్టైల్ షేర్వా త‌యారీ విధానం..

ముందుగా జార్ లో ఎండు కొబ్బ‌రి ముక్క‌లు, జీడిప‌ప్పు, సోంపు గింజ‌లు, గ‌స‌గ‌సాలు వేసి పొడిగా చేసుకోవాలి. త‌రువాత త‌గిన‌న్ని నీళ్లు పోసి మెత్త‌ని పేస్ట్ లాగా చేసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక మ‌సాలా దినుసులు, ఎండుమిర్చి, మిరియాలు వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు,క‌రివేపాకు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు ఎర్ర‌గా వేగిన త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత బంగాళాదుంప ముక్క‌లు వేసి వేయించాలి. బంగాళాదుంప ముక్క‌లుగా స‌గానికి పైగా వేగిన త‌రువాత కొత్తిమీర‌, పుదీనా వేసి వేయించాలి.

వీటిని ఒక నిమిషం పాటు వేయించిన త‌రువాత ధ‌నియాల పొడి, జీల‌క‌ర్ర పొడి, ప‌సుపు, ఉప్పు, కారం, గ‌రం మ‌సాలా వేసి క‌ల‌పాలి. వీటిని రెండు నిమిషాల పాటు వేయించిన త‌రువాత ట‌మాటాల‌ను ఫ్యూరీలాగా చేసుకుని వేసుకోవాలి. దీనిని నూనె పైకి తేలే వ‌ర‌కు వేయించిన త‌రువాత మ‌సాలా పేస్ట్ వేసి క‌ల‌పాలి. దీనిని 4 నుండి 5 నిమిషాల పాటు క‌లుపుతూ వేయించిన త‌రువాత నీళ్లు పోసి క‌ల‌పాలి. ఇప్పుడు మూత పెట్టి మ‌రో 20 నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే షేర్వా త‌యార‌వుతుంది. దీనిని ప‌రాటా, రోటీ, చ‌పాతీ, పుల్కా, ప్లేన్ బిర్యానీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది.

Tags: Street Style Sherwa
D

D

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Nipah Virus Symptoms : నిపా వైర‌స్ అల‌ర్ట్‌.. ఇది సోకిన వారిలో ల‌క్ష‌ణాలు ఎలా ఉంటాయి.. ఎలా వ్యాప్తి చెందుతుంది..?

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.