Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Tomato Rasam : ట‌మాటా ర‌సం త‌యారీ ఇలా.. 5 నిమిషాల్లో ఇలా చేయ‌వ‌చ్చు..!

D by D
December 17, 2023
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Tomato Rasam : ట‌మాటాల‌లో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో టమాట ర‌సం కూడా ఒక‌టి. ట‌మాట ర‌సం చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. ఈ ట‌మాట ర‌సాన్ని ఒక్కో ప‌ద్ద‌తిలో త‌యారు చేస్తూ ఉంటారు. కింద చెప్పిన విధంగా త‌యారు చేసే ట‌మాట ర‌సం కూడా చాలా రుచిగా ఉంటుంది. అలాగే చాలా త‌క్కువ స‌మ‌యంలో దీనిని త‌యారు చేసుకోవ‌చ్చు. నోటికి రుచిగా తినాల‌నిపించిన‌ప్పుడు ఇలా అప్ప‌టిక‌ప్పుడు ట‌మాట ర‌సాన్ని త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. మ‌రింత సుల‌భంగా, రుచిగా ట‌మాట ర‌సాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ట‌మాట ర‌సం త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నాన‌బెట్టిన చింత‌పండు – నిమ్మ‌కాయంత‌, ట‌మాటాలు – 3, నూనె – 2 టేబుల్ స్పూన్స్, తాళింపు దినుసులు -ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి- 2, దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు – 4, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, ఇంగువ – పావు టీ స్పూన్, పొడుగ్గా త‌రిగిన ఉల్లిపాయ – 1, ప‌సుపు – పావు టీ స్పూన్, కారం – అర టీ స్పూన్, ర‌సం పొడి – ఒక టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, నీళ్లు – త‌గినన్ని, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Tomato Rasam recipe very perfect way to make
Tomato Rasam

ట‌మాట ర‌సం త‌యారీ విధానం..

ముందుగా రెండు ట‌మాటాల‌ను జార్ లో వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. త‌రువాత మిగిలిన టమాటాల‌ను ముక్క‌లుగా క‌ట్ చేసి ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న ట‌మాట పేస్ట్ ను నాన‌బెట్టిన చింత‌పండులో వేసి క‌లుపుకోవాలి. ఇప్పుడు చింత‌పండు నుండి గుజ్జును తీసి వ‌డ‌క‌ట్టి ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత తాళింపు దినుసులు వేసి వేయించాలి. త‌రువాత ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బ‌లు వేసి వేయించాలి. త‌రువాత ప‌చ్చిమిర్చి, క‌రివేపాకు వేసివేయించాలి.

త‌రువాత ఇంగువ‌, ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి. త‌రువాత క‌ట్ చేసుకున్న ట‌మాట ముక్క‌లు వేసి వేయించాలి. ట‌మాట ముక్క‌లు మ‌గ్గిన త‌రువాత ప‌సుపు, ఉప్పు, కారం, ర‌సం పొడి వేసి క‌ల‌పాలి. త‌రువాత చింత‌పండు ర‌సం, నీళ్లు పోసి క‌ల‌పాలి. ఈ ర‌సాన్ని ఒక పొంగు వ‌చ్చే వ‌ర‌కు మ‌రిగించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ట‌మాట ర‌సం త‌యార‌వుతుంది. దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా చాలా సుల‌భంగా, చాలా త‌క్కువ స‌మ‌యంలో ట‌మాట ర‌సాన్ని త‌యారు చేసి తీసుకోవచ్చు.

Tags: tomato rasam
Previous Post

Walnuts : రోజూ రెండు వాల్ న‌ట్స్ చాలు.. ప్రాణాంత‌క వ్యాధులు మిమ్మ‌ల్ని ఏమీ చేయ‌లేవు..!

Next Post

Instant Ravva Uthappam : అప్ప‌టిక‌ప్పుడు ఈజీగా చేసుకునే ర‌వ్వ ఊత‌ప్పం.. ఇలా చేస్తే ఇష్టంగా తింటారు..!

Related Posts

ఆధ్యాత్మికం

మ‌హిళ‌లు అస‌లు ఎందుకు గాజుల‌ను ధ‌రించాలి..?

July 3, 2025
హెల్త్ టిప్స్

మ‌హిళ‌లు గ‌ర్భం ధ‌రించిన‌ప్పుడు ఈ 20 ఆహారాల‌కు దూరంగా ఉండాలి..!

July 3, 2025
ఆధ్యాత్మికం

వినాయ‌కుడి క‌థ నుంచి త‌ల్లిదండ్రులు నేర్చుకోవాల్సిన ముఖ్య‌మైన విష‌యాలు ఇవే..!

July 3, 2025
వైద్య విజ్ఞానం

పురుషుల క‌న్నా స్త్రీల‌కు 20 నిమిషాలు ఎక్కువ నిద్ర అవ‌స‌రం అట‌.. ఎందుకో తెలుసా..?

July 3, 2025
lifestyle

ఇప్పుడు మ‌నం వాడుతున్న బ్లేడ్ల‌కు అలా డిజైన్ ఎలా వ‌చ్చిందో తెలుసా..?

July 3, 2025
Off Beat

తాజ్ మహల్ గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా..? మొత్తం 1089 ర‌హ‌స్య గ‌దులు ఉన్నాయి..!

July 3, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
mythology

మ‌హాభార‌త కాలంలో ప‌న్నులు ఎలా వ‌సూలు చేసేవారో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.