Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Vankaya Nuvvula Kura : వంకాయ నువ్వుల కూర‌ను ఇలా చేయండి.. అన్నంలో తింటే సూప‌ర్‌గా ఉంటుంది..!

D by D
October 27, 2023
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Vankaya Nuvvula Kura : మ‌నం వంకాయ‌ల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. వంకాయ‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వంకాయ‌ల‌తో చేసే కూర‌లు చాలా రుచిగా ఉంటాయి. అలాగే చాలా సుల‌భంగా వీటిని త‌యారు చేసుకోవ‌చ్చు. వంకాయ‌ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన కూర‌ల‌ల్లో వంకాయ నువ్వుల కూర కూడా ఒక‌టి. నువ్వులు వేసి చేసే ఈ వంకాయ కూర ఎంతో క‌మ్మ‌గా ఉంటుంది. వంకాయ‌లను ఇష్ట‌ప‌డ‌ని వారు కూడా ఈ కూర‌ను ఇష్టంగా తింటారు. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. మ‌న ఆరోగ్యానికి మేలు చేసే కూర‌గాయ‌ల‌తో క‌మ్మ‌గా నువ్వుల కూర‌ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

వంకాయ నువ్వుల కూర త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నువ్వులు – పావు క‌ప్పు, వెల్లుల్లి రెబ్బ‌లు – 4, ఎండుమిర్చి – 10, నూనె – పావు క‌ప్పు, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, క‌రివేపాకు – రెండు రెమ్మ‌లు, త‌రిగిన లేత‌ పొడ‌వు వంకాయ ముక్క‌లు – అర‌కిలో, ప‌సుపు – అర టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, ధ‌నియాల పొడి – ఒక‌ టీ స్పూన్, నీళ్లు – పావు క‌ప్పు, చింత‌పండు – ర‌సం – పావు క‌ప్పు, కారం – ఒక టీ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్స్.

Vankaya Nuvvula Kura recipe in telugu make in this method
Vankaya Nuvvula Kura

వంకాయ నువ్వుల కూర త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో నువ్వులు, వెల్లుల్లి రెబ్బ‌లు, ఎండుమిర్చి వేసి వేయించాలి. త‌రువాత వీటిని జార్ లోకి తీసుకుని త‌గిన‌న్ని నీళ్లు పోసి మెత్త‌ని పేస్ట్ లాగా చేసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత జీల‌క‌ర్ర‌, ఆవాలు, క‌రివేపాకు వేసి వేయించాలి. ఇవి వేగిన త‌రువాత వంకాయ ముక్క‌లు, ఉప్పు, ప‌సుపు, ధ‌నియాల పొడి వేసిక‌ల‌పాలి. త‌రువాత వీటిపై మూత పెట్టి స‌గానికి పైగావేయించాలి. వంకాయ ముక్క‌లు వేగిన త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న పేస్ట్, నీళ్లు పోసి క‌ల‌పాలి. త‌రువాత మూత పెట్టి నూనె పైకి తేలే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత చింత‌పండు ర‌సం, కారం వేసి క‌ల‌పాలి. ఇప్పుడు మ‌ర‌లా మూత పెట్టి నూనె పైకి తేలే వ‌రకు ఉడికించి కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే వంకాయ నువ్వుల కూర త‌యార‌వుతుంది. దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. వంకాయ‌ల‌తో త‌రుచూ చేసే వంట‌కాల‌తో పాటు అప్పుడ‌ప్పుడూ ఇలా కూడా త‌యారు చేసి తీసుకోవ‌చ్చు.

Tags: Vankaya Nuvvula Kura
Previous Post

How To Use Coconut Oil : జుట్టు పెర‌గాలంటే.. కొబ్బ‌రినూనెను ఎలా ఉపయోగించాలో తెలుసా..?

Next Post

Paneer Bhurji : ప‌నీర్ భుర్జీని ఇలా చేస్తే.. లొట్ట‌లేసుకుంటూ మొత్తం తినేస్తారు..!

Related Posts

వైద్య విజ్ఞానం

పురుషుల క‌న్నా స్త్రీల‌కు 20 నిమిషాలు ఎక్కువ నిద్ర అవ‌స‌రం అట‌.. ఎందుకో తెలుసా..?

July 3, 2025
lifestyle

ఇప్పుడు మ‌నం వాడుతున్న బ్లేడ్ల‌కు అలా డిజైన్ ఎలా వ‌చ్చిందో తెలుసా..?

July 3, 2025
Off Beat

తాజ్ మహల్ గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా..? మొత్తం 1089 ర‌హ‌స్య గ‌దులు ఉన్నాయి..!

July 3, 2025
పోష‌ణ‌

మీ చ‌ర్మం ఎల్ల‌ప్పుడూ య‌వ్వ‌నంగా క‌నిపించాలంటే వీటిని తీసుకోండి..!

July 3, 2025
చిట్కాలు

ప‌సుపు రంగులోకి మారిన మీ దంతాలు మళ్లీ తెల్ల‌గా మారాలంటే ఈ చిట్కాల‌ను పాటించండి..!

July 3, 2025
హెల్త్ టిప్స్

డ‌యాబెటిస్ ఉన్న‌వారు వీటిని తింటే షుగర్‌ను కంట్రోల్ చేయ‌వ‌చ్చు..!

July 3, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
mythology

మ‌హాభార‌త కాలంలో ప‌న్నులు ఎలా వ‌సూలు చేసేవారో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.