Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Vankaya Palli Karam : వంకాయ ప‌ల్లికారం ఇలా చేయండి.. అన్నంలోకి ఎంతో బాగుంటుంది..!

D by D
September 4, 2023
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Vankaya Palli Karam : వంకాయ ప‌ల్లికారం… వంకాయ‌ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో ఇది కూడా ఒక‌టి. ప‌ల్లికారం వేసి చేసే ఈ వంకాయ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేసుకోవ‌డం కూడా చాలా సుల‌భం. త‌ర‌చూ ఒకేర‌కం వంకాయ ఫ్రై కాకుండా ఇలా వెరైటీగా కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉండే ఈ వంకాయ ప‌ల్లికారాన్ని ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

వంకాయ ప‌ల్లికారం త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

వంకాయ‌లు – పావుకిలో, నూనె – 2 టేబుల్ స్పూన్స్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, స‌న్న‌గా త‌రిగిన ఉల్లిపాయ – 1, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, ప‌సుపు – పావు టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌.

Vankaya Palli Karam recipe in telugu make in this method
Vankaya Palli Karam

కారం పొడి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ప‌ల్లీలు – 2 టీ స్పూన్స్, నూనె – 2 టీ స్పూన్స్, శ‌న‌గ‌ప‌ప్పు – ఒక టీస్పూన్, మిన‌ప‌ప్పు – ఒక టీ స్పూన్, ధ‌నియాలు – అర టీ స్పూన్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, ఎండుమిర్చి – 6, వెల్లుల్లి రెబ్బ‌లు – 5, అల్లం – ఒక చిన్న ముక్క‌.

వంకాయ ప‌ల్లికారం త‌యారీ విధానం..

ముందుగా వంకాయ‌ల‌ను ముక్క‌లుగా క‌ట్ చేసుకుని ఉప్పు నీటిలో వేసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో ప‌ల్లీలు వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత అదే క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత శ‌న‌గ‌ప‌ప్పు, మిన‌ప‌ప్పు, జీల‌క‌ర్ర‌, ధ‌నియాలు వేసి వేయించాలి. త‌రువాత ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బ‌లు, అల్లం ముక్క‌లు వేసి వేయించాలి. త‌రువాత వీటిని ఒక జార్ లోకి తీసుకుని మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత వేయించిన ప‌ల్లీలు వేసి బ‌ర‌క‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక తాళింపు దినుసులు వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు, క‌రివేపాకు వేసి వేయించాలి.

తాళింపు చ‌క్క‌గా వేగిన త‌రువాత వంకాయ ముక్క‌లు, ప‌సుపు, ఉప్పు వేసి క‌ల‌పాలి. ఇప్పుడు వీటిపై మూత పెట్టి మ‌ధ్య మ‌ధ్య‌లో క‌లుపుతూ వంకాయ ముక్క‌లు మెత్త‌గా అయ్యే వ‌ర‌కు వేయించాలి. వంకాయ ముక్క‌లు వేగిన త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న కారం పొడి వేసి క‌ల‌పాలి. దీనిని మ‌రో రెండు నిమిషాల పాటు వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే వంకాయ ప‌ల్లికారం త‌యార‌వుతుంది. దీనిని అన్నంతో క‌లిపి తింటే చాలారుచిగా ఉంటుంది. వంకాయ‌ల‌ను ఇష్ట‌ప‌డని వారు కూడా ఈ విధంగా త‌యారు చేసిన వంకాయ ప‌ల్లికారాన్ని ఇష్టంగా తింటారు.

Tags: Vankaya Palli Karam
Previous Post

Kanuga For Skin Problems : దీన్ని ఇలా వాడితే చాలు.. మీకున్న చ‌ర్మ స‌మ‌స్య‌లు అన్నీ పోతాయి..!

Next Post

Nuvvula Pachadi : నువ్వుల‌తో ప‌చ్చ‌డి ఇలా చేయండి.. అన్నం, ఇడ్లీలు, దోశ‌ల్లోకి ఎంతో బాగుంటుంది..!

Related Posts

ఆధ్యాత్మికం

మీకు శ‌నిదోషం ఉందా..? అయితే ఈ ప‌రిహారాల‌ను పాటిస్తే మంచిది..!

July 3, 2025
ఆధ్యాత్మికం

ఏ వేలితో బొట్టు పెట్టుకుంటే ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయంటే..?

July 3, 2025
ఆధ్యాత్మికం

శుక్ర‌వారం నాడు ఇలా చేస్తే మీ ఇంట్లో ల‌క్ష్మీ క‌టాక్ష‌మే..!

July 3, 2025
lifestyle

స్త్రీల‌లో పురుషులు ఇష్టప‌డే 15 అంశాలు ఇవే తెలుసా..?

July 3, 2025
హెల్త్ టిప్స్

ఈ 5 ర‌కాల తెల్ల‌ని విష ప‌దార్థాల‌ను మ‌నం రోజూ తింటున్నామ‌ని తెలుసా..?

July 3, 2025
హెల్త్ టిప్స్

గోధుమ రొట్టె, అన్నం రెండూ ఒకేసారి తిన‌కూడ‌దా..? తింటే ఏమ‌వుతుందో తెలుసా..?

July 3, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.