Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Village Style Chicken Curry : ప‌ల్లెటూరి స్టైల్‌లో కోడికూర‌ను ఇలా చేయండి.. ఎంతో ఇష్టంగా తింటారు.. సూప‌ర్‌గా ఉంటుంది..!

D by D
February 28, 2023
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Village Style Chicken Curry : చికెన్ ను మ‌న‌లో చాలా మంది ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. చికెన్ తో చేసే వంట‌కాల‌ను తిన‌డం వ‌ల్ల మ‌నం రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చు. చికెన్ తో ఎక్కువ‌గా మ‌నం కూర‌ను వండుతూ ఉంటాం. చికెన్ కూర‌ను ఒక్కొక్క‌రు ఒక్కోలా త‌యారు చేస్తూ ఉంటాం. ఈ చికెన్ క‌ర్రీని రుచిగా, తేలిక‌గా, విలేజ్ స్టైల్ లో ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

విలేజ్ స్టైల్ చికెన్ క‌ర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

చికెన్ – అర‌కిలో, త‌రిగిన పెద్ద ఉల్లిపాయ – 1, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 4, పెరుగు – ఒక టేబుల్ స్పూన్, త‌రిగిన ట‌మాటాలు – 2, అల్లం – 2 ఇంచుల ముక్క‌, వెల్లుల్లి రెబ్బలు – 10, ధ‌నియాలు – ఒక టేబుల్ స్పూన్, గ‌స‌గ‌సాలు – అర టేబుల్ స్పూన్, యాల‌కులు – 2, ల‌వంగాలు – 4, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, ప‌చ్చి కొబ్బ‌రి ముక్క‌లు – ఒక టేబుల్ స్పూన్, చికెన్ మ‌సాలా- ఒక టేబుల్ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, నూనె – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, కొత్తిమీర – కొద్దిగా.

Village Style Chicken Curry recipe in telugu make in this method
Village Style Chicken Curry

విలేజ్ స్టైల్ చికెన్ త‌యారీ విధానం..

ముందుగా చికెన్ లో అర టీ స్పూన్ ఉప్పు, అర టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ ప‌సుపు, పెరుగు, అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఒక టీ స్పూన్ నూనె వేసి బాగా క‌ల‌పాలి. త‌రువాత దీనిపై మూత‌ను ఉంచి 10 నిమిషాల పాటు ప‌క్క‌కు ఉంచాలి. ఇప్పుడు రోట్లో అల్లం, వెల్లుల్లి, కొబ్బ‌రి ముక్క‌లు వేసి మెత్త‌గా దంచుకోవాలి. త‌రువాత ధ‌నియాలు, గ‌స‌గ‌సాలు, దాల్చిన చెక్క‌, ల‌వంగాలు, యాల‌కులు వేసి మెత్త‌గా దంచుకోవాలి. అవ‌స‌ర‌మైతే కొద్దిగా నీళ్లు పోసి మెత్త‌గా దంచుకుని గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక క‌రివేపాకు, ఉల్లిపాయ‌లు వేసి వేయించాలి. త‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి మెత్త‌గా అయ్యే వ‌ర‌కు వేయించాలి.

త‌రువాత ముందుగా సిద్దం చేసుకున్న చికెన్ వేసి క‌ల‌పాలి. దీనిని ప‌ది నిమిషాల పాటు ఉడికించిన త‌రువాత ముందుగా దంచుకున్న మ‌సాలా, చికెన్ మ‌సాలా, ఉప్పు, కారం వేసి క‌ల‌పాలి. దీనిని నూనె పైకి తేలే వ‌ర‌కు ఉడికించిన త‌రువాత ఒక గ్లాస్ నీళ్లు పోసి క‌ల‌పాలి. త‌రువాత దీనిపై మూత పెట్టి చికెన్ మెత్త‌గా అయ్యే వ‌ర‌కు ఉడికించాలి. ఇలా ఉడికించిన త‌రువాత కొత్తిమీర‌, ప‌చ్చిమిర్చి వేసి క‌ల‌పాలి. దీనిని మ‌రో నిమిషం పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే చికెన్ క‌ర్రీ త‌యార‌వుతుంది. దీనిని అన్నం, చ‌పాతీ, రోటి, సంగ‌టి వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. త‌ర‌చూ చేసే చికెన్ కంటే ఈ విధంగా చేసిన చికెన్ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. ఈ చికెన్ క‌ర్రీని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Tags: Village Style Chicken Curry
Previous Post

Coconut Water For Pregnants : గ‌ర్భిణీలు కొబ్బ‌రినీళ్ల‌ను తాగ‌వ‌చ్చా.. తాగితే ఏమ‌వుతుంది..?

Next Post

Beauty Tips : దీన్ని ముఖంపై రాస్తే చాలు.. న‌లుపు మొత్తం పోతుంది.. తెల్ల‌గా మారుతారు..!

Related Posts

ఆధ్యాత్మికం

వినాయ‌కుడి క‌థ నుంచి త‌ల్లిదండ్రులు నేర్చుకోవాల్సిన ముఖ్య‌మైన విష‌యాలు ఇవే..!

July 3, 2025
వైద్య విజ్ఞానం

పురుషుల క‌న్నా స్త్రీల‌కు 20 నిమిషాలు ఎక్కువ నిద్ర అవ‌స‌రం అట‌.. ఎందుకో తెలుసా..?

July 3, 2025
lifestyle

ఇప్పుడు మ‌నం వాడుతున్న బ్లేడ్ల‌కు అలా డిజైన్ ఎలా వ‌చ్చిందో తెలుసా..?

July 3, 2025
Off Beat

తాజ్ మహల్ గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా..? మొత్తం 1089 ర‌హ‌స్య గ‌దులు ఉన్నాయి..!

July 3, 2025
పోష‌ణ‌

మీ చ‌ర్మం ఎల్ల‌ప్పుడూ య‌వ్వ‌నంగా క‌నిపించాలంటే వీటిని తీసుకోండి..!

July 3, 2025
చిట్కాలు

ప‌సుపు రంగులోకి మారిన మీ దంతాలు మళ్లీ తెల్ల‌గా మారాలంటే ఈ చిట్కాల‌ను పాటించండి..!

July 3, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
mythology

మ‌హాభార‌త కాలంలో ప‌న్నులు ఎలా వ‌సూలు చేసేవారో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.