Corona Cases Today : దేశవ్యాప్తంగా రోజూ భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. రోజూ 2 లక్షలకు పైగానే కేసులు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా మూడో వేవ్ కారణంగా ఇప్పటికే ఎన్నో లక్షల మందికి కొత్తగా కరోనా సోకింది. ఇక గడిచిన 24 గంటల్లో 16,15,993 కోవిడ్ నిర్దారణ పరీక్షలు చేయగా.. మొత్తం 2,34,281 కేసులు కొత్తగా నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వివరాలను వెల్లడించింది.
గడిచిన 24 గంటల్లో ఒక్క కేరళలోనే 50,812 కరోనా కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 27,971 కేసులు నమోదు కాగా దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 13.39 నుంచి 14.50 శాతంకు పెరిగింది. ఇది మరింత ఆందోళన కలిగించే విషయమని నిపుణులు అంటున్నారు.
గడిచిన 24 గంటల్లో 893 మంది చనిపోయారు. ఈ క్రమంలో కరోనా కారణంగా మొత్తం చనిపోయిన వారి సంఖ్య 4,94,091కి చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 3,52,784 మంది కోలుకున్నారు. 3.87 కోట్ల మంది మొత్తం కోవిడ్ నుంచి రికవరీ అయ్యారు. రికవరీ రేటు ప్రస్తుతం 94.21 శాతంగా ఉంది.
యాక్టివ్ కేసుల సంఖ్య దేశవ్యాప్తంగా 18,84,937 గా ఉంది. ఆ రేటు 4.59 శాతంగా ఉంది. దేశంలో గడిచిన 24 గంటల్లో 62,22,682 డోసులు వేశారు. మొత్తం తీసుకున్న డోసుల సంఖ్య 165 కోట్లు దాటింది.