Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వార్త‌లు

Omicron Sub Variant : ఒమిక్రాన్‌ను త‌ల‌ద‌న్నే వేరియెంట్‌.. దానిక‌న్నా మ‌రింత వేగంగా వ్యాప్తి..

Editor by Editor
February 2, 2022
in వార్త‌లు, హెల్త్ న్యూస్
Share on FacebookShare on Twitter

Omicron Sub Variant : ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ బెంబేలెత్తిస్తున్న విష‌యం విదిత‌మే. క‌రోనా వైర‌స్‌కు చెందిన ఒమిక్రాన్ వేరియెంట్ 200కు పైగా దేశాల్లో శ‌ర‌వేగంగా వ్యాప్తి చెందుతోంది. మ‌న దేశంలోనూ తాజాగా వ‌స్తున్నవ‌న్నీ ఒమిక్రాన్ వేరియెంట్ కేసులేన‌ని నిపుణులు కూడా చెబుతున్నారు. ఈ క్ర‌మంలోనే మ‌రింత ఆందోళ‌న‌కు గురిచేస్తున్న వార్త ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఒమిక్రాన్ వేరియెంట్‌కు గాను స‌బ్‌వేరియెంట్ త‌యారైంది. దీన్ని ప‌లు దేశాల్లో గుర్తించామ‌ని నిపుణులు తెలిపారు.

Omicron Sub Variant identified by scientists its spreading quickly

డెన్మార్క్‌లోని స్టాటెన్స్ సీర‌మ్ ఇనిస్టిట్యూట్ (ఎస్ఎస్ఐ)కు చెందిన ప‌రిశోధ‌కులు తాజాగా చేసిన అధ్య‌య‌నాల్లో ఒమిక్రాన్ వేరియెంట్‌కు గాను స‌బ్ వేరియెంట్‌ను గుర్తించారు. దానికి బీఎ.2 గా నామ‌క‌ర‌ణం చేశారు. ఒమిక్రాన్‌కు బీఏ.1 గా నామ‌క‌ర‌ణం చేయ‌గా.. ఇప్పుడు వ‌చ్చింది దాని స‌బ్ వేరియెంట్ కావ‌డం విశేషం. ఇక బీఏ.2 వేరియెంట్ గురించి నిపుణులు షాకింగ్ విష‌యాల‌ను వెల్ల‌డించారు.

బీఏ.2 వేరియెంట్ ఒమిక్రాన్ క‌న్నా ఎక్కువ వేగంగా వ్యాప్తి చెందుతుంద‌ని నిపుణులు తెలిపారు. మెడ్ ఆర్ఎక్స్ఐవీ అనే వెబ్‌సైట్‌లో ఈ కొత్త వేరియెంట్‌కు చెందిన అధ్య‌య‌న వివ‌రాల‌ను ప్ర‌చురించారు. బీఏ.2 వేరియెంట్ ఒక‌రి నుంచి మ‌రొక‌రికి శ‌ర‌వేగంగా వ్యాప్తి చెందుతుంద‌ని తెలిపారు. మ‌న శ‌రీరంలో ఉండే రోగ నిరోధ‌క శ‌క్తిని సైతం మార్చివేయ‌గ‌ల శ‌క్తి బీఏ.2కు ఉంద‌ని తెలిపారు. అంటే మ‌న శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి నుంచి సైతం బీఏ.2 వేరియెంట్ త‌ప్పించుకోగ‌ల‌ద‌న్న‌మాట‌. ఇది ఆందోళ‌న క‌లిగించే విష‌య‌మ‌ని అంటున్నారు.

బీఏ.1 (ఒమిక్రాన్‌) వ్యాప్తి రేటు 29 శాతంగా ఉండ‌గా.. బీఏ.2 వ్యాప్తి రేటు 39 శాతంగా ఉంద‌ని తెలిపారు. అంటే ఒమిక్రాన్ క‌న్నా బీఏ.2 వేరియెంట్ మ‌రింత వేగంగా వ్యాప్తి చెందుతున్న‌ట్లు అర్థ‌మ‌వుతుంద‌ని అన్నారు. ఇలాంటి స్థితిలో క‌రోనా వ్యాక్సిన్ తీసుకోని వారిలో ఈ వేరియెంట్ మ‌రింత వేగంగా వ్యాప్తి చెందుతుంద‌ని అన్నారు. క‌నుక ప్ర‌తి ఒక్క‌రూ త‌ప్ప‌నిస‌రిగా కోవిడ్ టీకా తీసుకోవాల‌ని, క‌రోనా ప‌ట్ల జాగ్ర‌త్త‌ల‌ను పాటించాల‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.

Tags: ba.2 variantcorona viruscovid 19Omicron Sub Variantఒమిక్రాన్ స‌బ్ వేరియెంట్‌క‌రోనా వైర‌స్‌కోవిడ్ 19బీఏ.2 వేరియెంట్‌
Previous Post

Sweet Potatoes : వీటిని రోజూ తింటే కంటి చూపు అమాంతం పెరుగుతుంది.. కళ్లద్దాలను పక్కన పడేస్తారు..!

Next Post

Milk : ప్యాకెట్ పాల‌ను తాగ‌వ‌చ్చా ? అవి హానిక‌ర‌మా ?

Related Posts

అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

మ‌ట‌న్‌ను తిన‌డం ఆరోగ్యానికి మంచిదేనా..? కొలెస్ట్రాల్‌పై దీని ప్ర‌భావం ఏమిటి..?

May 31, 2025
చిట్కాలు

మ‌ల‌బ‌ద్ద‌కాన్ని త‌గ్గించే అద్భుత‌మైన చిట్కా.. ఇలా చేయండి చాలు..

May 31, 2025
అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

రోజూ చేప‌ల‌ను తింటే డ‌యాబెటిస్ త‌గ్గుతుంద‌ట‌..!

May 31, 2025
information

ఇలా చేయండి…కరెంట్ బిల్ తక్కువగా వచ్చేలా చేసుకోండి. సింపుల్ ట్రిక్స్.

May 31, 2025
information

క్రెడిట్ కార్డు వాడేవాళ్లు గుర్తుంచుకోవాల్సిన 8 ముఖ్య విషయాలు….

May 31, 2025
హెల్త్ టిప్స్

ఆవు పాలు, గేదె పాలు.. ఈ రెండింటిలో ఏ పాలు బెట‌ర్‌..?

May 31, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Date Seeds : ఖ‌ర్జూరాల‌ను తింటే వాటిల్లో ఉండే విత్త‌నాల‌ను ప‌డేయ‌కండి.. ఎందుకంటే..?

by Editor
December 25, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
మొక్క‌లు

Ranapala : ఈ మొక్క ఆకుల‌ను ప‌ర‌గ‌డుపునే తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా..? ఎక్క‌డ క‌నిపించినా విడిచిపెట్ట‌కండి..

by D
December 15, 2022

...

Read more
పండ్లు

అంజీర్ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు

by Admin
December 6, 2021

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!