Yoga : మన మన శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి అనేక రకాల వ్యాయామాలు చేస్తూ ఉంటాము. వాటిలో యోగా కూడా ఒకటి. ఎంతో కాలంగా భారతీయులు యోగాను ప్రతిరోజూ వ్యాయామంలో భాగంగా చేస్తున్నారు. అలాగే మనం ప్రతి సంవత్సరం జూన్ 21 న యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. నేటి తరుణంలో ఇతర దేశాల్లో కూడా యోగా ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. యోగా చేయడం వల్ల మన శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. యోగా చేయడం అలవాటు లేని వారు కూడా దీనిని ప్రతిరోజూ వ్యాయామంలో భాగంగా చేయాలని నిపుణులు చెబుతున్నారు. యోగా చేయడం వల్ల మనం ఎన్నో ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. యోగా చేయడం వల్ల కలిగే ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. యోగా చేయడం వల్ల శ్వాసక్రియ మెరుగుపడుతుంది.
ప్రాణాయామాలు, బ్రీతింగ్ ఎక్సర్ సైజ్ లు కూడా యోగాలో భాగమే. ఇవి చేయడం వల్ల ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే మానసిక ప్రశాంతత లభిస్తుంది. చాలా మంది తరుచూ అసూయ, కోపం, ద్వేషం వంటి వాటిని ఎక్కువగా ఇతరులపై చూపిస్తూ ఉంటారు. యోగా చేయడం వల్ల ఇవన్నీ తగ్గడంతో పాటు మనస్సు కూడా ప్రశాతంగా ఉంటుంది. అలాగే మనలో చాలా మందికి ఏ పని పైనా కూడా శ్రద్ద, ఏకాగ్రత, ధ్యాస వంటివి ఉండవు. అలాంటి వారు యోగా చేయడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. పని మీద ధ్యాస చూపించవచ్చు. అదే విధంగా చాలా మంది పనులను గాబరాగా చేస్తూ ఉంటారు. అలాంటి వారు యోగా చేయడం వల్ల పారా సింపథెటిక్ నాడి వ్యవస్థ సక్రమంగా పని చేస్తుంది. దీంతో ఒత్తిడి తగ్గుతుంది. పనులను గాబరా లేకుండా, తొందర లేకుండా చేసుకోవచ్చు. ప్రశాంతమైన జీవితాన్ని గడపవచ్చు. యోగా చేయడం వల్ల కండరాలు ధృడంగా మారతాయి. శారీరకంగా బలంగా తయారు కావచ్చు.
నీరసం, బలహీనత వంటివి మన దరి చేరకుండా ఉంటాయి. అంతేకాకుండా యోగా చేయడం వల్ల శరీరంలో వ్యర్థాలు బయటకు పోతాయి. శరీర ఆరోగ్యం మెరుగుపడుతుంది. యోగా చేయడం వల్ల మన జీవన విధానంలో అనేక మార్పులు వస్తాయి. దీంతో మనకు ఉన్న కొన్ని అనారోగ్య సమస్యలు వాటంతట అవే తగ్గిపోతాయి. అయితే యోగాలో చాలా నిపుణులైన యోగా గురువుల వద్దనే యోగాను నేర్చుకుని చేయాలని అప్పుడే మనం కుండలినీ శక్తికి సంబంధించిన యోగాభ్యాసాలు చేయగలుగుతాము. ఈ విధంగా యోగా మన మానసిక ఆరోగ్యాన్ని, శారీరక ఆరోగ్యాన్ని ఎంతగానో పెంపొందిస్తుందని దీనిని తప్పకుండా అందరూ వ్యాయామంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పిల్లలకు దీనిని చిన్న వయసు నుండే అలవాటు చేయాలని వారు చెబుతున్నారు.