అధికంగా బరువు ఉంటే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయన్న సంగతి తెలిసిందే. అధిక బరువు వల్ల గుండె జబ్బులు, హైబీపీ, టైప్ 2 డయాబెటిస్ వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. అందువల్ల అధిక బరువును తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే అధిక బరువును వేగంగా తగ్గించుకునేందుకు కింద తెలిపిన జ్యూస్‌లు ఎంతగానో ఉపయోగపడతాయి. వీటిని రోజూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల మెరుగైన ఫలితాలు సాధించవచ్చు. అయితే ఈ జ్యూస్‌లలో చక్కెరకు బదులుగా తేనెను కలుపుకుని తాగాల్సి ఉంటుంది.
1. కీరదోస
కీరదోస జ్యూస్‌ను తాగడం వల్ల శరీరంలో ఉన్న కొవ్వు కరుగుతుంది. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. అధిక బరువు తగ్గేందుకు ఈ జ్యూస్ ఎంతగానో సహాయ పడుతుంది. రోజూ ఉదయాన్నే ఈ జ్యూస్ తాగితే ఫలితం ఉంటుంది. కీరదోస జ్యూస్ మనకు ఎన్నో పోషకాలను కూడా అందిస్తుంది. శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి.
2. క్యారెట్
అధిక బరువును వేగంగా తగ్గించుకునేందుకు క్యారెట్ జ్యూస్ సహాయ పడుతుంది. దీని వల్ల శరీర మెటబాలిజం పెరుగుతుంది. శరీరంలో ఉన్న కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు.
3. క్యాబేజీ
క్యాబేజీలో అనేక విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. ఇవి అధిక బరువును తగ్గిస్తాయి. రోజూ క్యాబేజీ జ్యూస్‌ను తాగితే బరువు తగ్గుతారు.
4. కొత్తిమీర
కొత్తిమీరలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది బరువు తగ్గేందుకు సహాయ పడుతుంది. శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి. జీర్ణ సమస్యలు ఉండవు.
5. కాకరకాయ
కాకరకాయ జ్యూస్ అంటే కేవలం డయాబెటిస్ ఉన్నవారు మాత్రమే తాగాలి అనుకుంటే పొరపాటు. ఇతర వ్యక్తులు కూడా ఈ జ్యూస్‌ను నిత్యం తాగవచ్చు. దీని వల్ల శరీర మెటబాలిజం పెరుగుతుంది. అధిక బరువు త్వరగా తగ్గుతారు.
6. ఉసిరి
ఉసిరికాయలను పోషకాలకు నిధిగా భావిస్తారు. ఉసిరిలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఈ జ్యూస్‌ను నిత్యం తాగితే శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. చర్మం, వెంట్రుకలు ఆరోగ్యంగా ఉంటాయి. గుండె సురక్షితంగా ఉంటుంది. అధిక బరువు తగ్గుతారు.
7. బీట్‌రూట్
బీట్‌రూట్ జ్యూస్‌ను తాగడం వల్ల శరీరంలో రక్తం బాగా పెరుగుతుంది. హైబీపీ తగ్గుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. శరీరంలోని కొవ్వు కరుగుతుంది. వ్యర్థాలు బయటకు పోతాయి.
8. దానిమ్మ పండు
దానిమ్మ పండ్లలో ఫైబర్, పొటాషియం, విటమిన్ సి వంటి పోషకాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని సంరక్షిస్తుంది. కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇన్ఫెక్షన్లు రాకుండా చూస్తాయి. దానిమ్మ పండ్ల జ్యూస్‌ను రోజూ తాగితే శరీర మెటబాలిజం పెరుగుతుంది. అధిక బరువు త్వరగా తగ్గుతారు.
9. పుచ్చకాయ
వేసవిలో పుచ్చకాయలు మనకు విరివిగా లభిస్తాయి. వీటిని తినడం వల్ల వేసవి తాపం తగ్గి శరీరం చల్లబడుతుంది. పుచ్చకాయల్లో ఉండే విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు మెటబాలిజంను పెంచుతాయి. దీని వల్ల బరువు తగ్గుతారు.
10. నారింజ
నారింజ పండ్ల జ్యూస్‌ను రోజూ తాగడం వల్ల కూడా అధిక బరువు తగ్గవచ్చు. దీని వల్ల మనకు విటమిన్ సి అధికంగా లభిస్తుంది. శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.