20 Health Principles For Longer Life : ఆరోగ్యంగా ఉండడం కోసం ప్రస్తుత తరుణంలో చాలా మంది అనేక ఆరోగ్య సూత్రాలను పాటిస్తున్నారు. రోజూ చాలా మంది వ్యాయామం చేయడం, పౌష్టికాహారం తీసుకోవడం చేస్తున్నారు. కానీ ఇవే కాదు.. ఆరోగ్యంగా ఉండాలన్నా.. 100 ఏళ్లు జీవించాలన్నా.. ఆయుష్షు పెరగాలన్నా.. మనం పాటించాల్సిన ఆరోగ్య సూత్రాలు కొన్ని ఉన్నాయి. ఈ 20 ఆరోగ్య సూత్రాలను రోజూ పాటించాల్సిందే. వీటిని పాటించడం వల్ల నూరేళ్లు జీవించవచ్చు. ఆయుష్షు పెరుగుతుంది. 100 ఏళ్ల వరకు ఎలాంటి రోగాలు రావు. ఇక ఆ సూత్రాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. చక్కెరను తీసుకోవడం మానేయాలి. చక్కెర ఉండే ఏ పదార్థాన్ని కూడా తీసుకోరాదు. అందుకు బదులుగా తేనెను రోజూ కాస్త వాడవచ్చు.
2. బాదం, జీడిపప్పు, వాల్ నట్స్, కిస్ మిస్.. వీటన్నింటినీ కలిపి రోజూ గుప్పెడు తినాలి.
3. బేకరీ పదార్థాలు, స్నాక్స్, చిప్స్, నూనె పదార్థాలు, ఫాస్ట్ ఫుడ్స్, ప్యాక్డ్ ఫుడ్స్ తినరాదు.
4. టీ, కాఫీ రోజుకు 2 కప్పులు మించి తాగరాదు. పూర్తిగా మానేస్తే మంచిది. బదులుగా పాలను తాగాలి.
5. చేపలను వారంలో కనీసం రెండు సార్లు అయినా తినాలి.
6. రోజూ తప్పనిసరిగా 8 గంటలపాటు నిద్రించాలి. మధ్యాహ్నం నిద్ర పనికి రాదు.
7. రోజూ 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. తేలికపాటి వాకింగ్ చేసినా చాలు.
8. రోజూ 8 గ్లాసుల నీళ్లను తప్పనిసరిగా తాగాలి.
9. రోజూ 10 నిమిషాల పాటు అయినా ప్రకృతిలో గడపాలి. స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను పీల్చాలి.
10. ఒత్తిడి, ఆందోళన, టెన్షన్లు లేకుండా జీవించాలి. వాటిని తగ్గించుకునేందుకు సంగీతం వినడం, పుస్తకాలు చదవడం, యోగా, మెడిటేషన్ చేయడం వంటివి చేయాలి.
11. జీర్ణాశయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. పెరుగు, మజ్జిగలను తీసుకోవాలి.
12. అతిగా మాంసాహారం తినరాదు. మద్యం సేవించరాదు. పొగ తాగరాదు.
13. కూరగాయలు, పండ్లు, విత్తనాలను అధికంగా తీసుకోవాలి.
14. తేలిగ్గా జీర్ణం అయ్యే ఆహారాలకు ప్రాధాన్యత ఇవ్వాలి.
15. గానుగలో ఆడించిన నూనెలను మాత్రమే వాడాలి.
16. పిండి పదార్థాలను తక్కువగా తీసుకోవాలి.
17. మూలికలు, ఔషధ గుణాలు అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి.
18. వెల్లుల్లి, పచ్చి ఉల్లిపాయ, పసుపు, వాము, అల్లం వంటివి రోజూ తీసుకోవాలి.
19. కాకరకాయ వంటి చేదు ఆహారాలను రోజూ తినాలి.
20. పొట్ట దగ్గర కొవ్వు పేరుకుపోకుండా చూసుకోవాలి.