5 Foods For High BP : నేటి తరుణంలో వయసుతో సంబంధం లేకుండా మనలో చాలా మందిని వేధిస్తున్న అనారోగ్య సమస్యల్లో బీపీ కూడా ఒకటి. బీపీ కారణంగా మనలో చాలా మంది అనేక ఇబ్బందులు పడుతున్నారు. మారిన మన జీవన విధానం, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఆందోళన, ఊబకాయం వంటి వాటిని బీపీ బారిన పడడానికి కారణాలుగా చెప్పవచ్చు. ఈ వ్యాధి చాప కింద నీరులా శరీర ఆరోగ్యనంతటిని సన్నగిల్లేలా చేస్తుంది. వైద్యులు కూడా దీనిని సైలెంట్ కిల్లర్ గా అభివర్ణిస్తూ ఉంటారు. ఒక్కసారి ఈ వ్యాధి బారిన పడితే జీవితాంతం మందులు మింగాల్సిన పరిస్థితి నెలకొంటుంది. అయితే మందులు వాడడంతో పాటు కొన్ని ఆహారాలను తీసుకోవడం వల్ల మనం చాలా సులభంగా బీపీని అదుపులో ఉంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల ఎల్లప్పుడూ బీపీ అదుపులో ఉంటుంది.
అలాగే మనం వాడాల్సిన మందుల మోతాదు కూడా తగ్గుతుంది. దీంతో మందుల వల్ల కలిగే దుష్ప్రభావాల బారిన కూడా మనం పడకుండా ఉంటాము. సహజంగా లభించే ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల రక్తనాళాలు ఎక్కువగా వ్యాకోచిస్తాయి. దీంతో రక్తనాళాల్లో రక్తం సులభంగా ప్రవహించగలుగుతుంది. తద్వారా బీపీ అదుపులో ఉంటుంది. బీపీని అదుపులో ఉంచే ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బీపీ సమస్యతో బాధపడే వారు వారి ఆహారంలో చేపలను చేర్చుకోవాలి. చేపలల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లతో పాటు పొటాషియం కూడా ఉంటుంది.
చేపలను తీసుకోవడం వల్ల బీపీ తగ్గడంతో పాటు గుండె ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. అదే విధంగా బీపీతో బాధపడే వారు పిస్తాపప్పును ఎక్కువగా తీసుకోవాలి. వీటిలో పొటాషియంతో పాటు మన శరీరానికి అవసరమయ్యే పోషకాలు, మంచి కొవ్వులు కూడా ఉంటాయి. బీపీతో బాధపడే వారు పిస్తా పప్పును తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇక ఆకుకూరలల్లో కూడా పొటాషియం కూడా ఎక్కువగా ఉంటుంది. రోజూ వారి ఆహారంలో భాగంగా రోజూ ఒక ఆకుకూరను తీసుకోవడం వల్ల బీపీ అదుపులో ఉంటుంది. అలాగే బీపీతో బాధపడే వారు బీట్ రూట్ ఆకులను తీసుకోవడం వల్ల మన కూడా ఎంతో మేలు కలుగుతుంది. బీట్ రూట్ ఆకులను కాడలతో సహా కట్ చేసి సలాడ్ వంటి వాటిలో వేసి తీసుకోవచ్చు. అలాగే వీటిని షాలో ఫ్రై చేసి కూడా తీసుకోవచ్చు. ఈ ఆకుల్లో ఎక్కువగా పొటాషియం బీపీని తగ్గించడంలో దోహదపడుతుంది.
అదే విధంగా బీపీతో బాధపడే వారు పెరుగును కూడా తీసుకోవాలి. పెరుగును తీసుకోవడం వల్ల మనం తీసుకునే ఆహారంలో ఉండే పొటాషియం శరీరానికి చక్కగా అందుతుంది. అలాగే పెరుగును తీసుకోవడం వల్ల బీపీ కూడా అదుపులో ఉంటుంది. ఈ విధంగా ఈ ఆహారాలను మన రోజూ వారి ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల సహజ సిద్దంగా కూడా మనం బీపీని అదుపులో ఉంచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఈ ఆహారాలను తీసుకునే వారు బీపీకి సంబంధించిన పరీక్షలు తరుచూ చేయించుకుంటూ వైద్యున్ని సూచన మేరకు మందులను వాడాలని నిపుణులు తెలియజేస్తున్నారు.