తేనెను సహజంగానే చాలా మంది రోజూ ఉపయోగిస్తుంటారు. ఇది అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తుంది. జుట్టు రాలడం, హైబీపీ, అధిక బరువు, చర్మ సమస్యలను తగ్గించడంలో తేనె బాగా పనిచేస్తుంది. ఇందులో యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉంటాయి. అలాగే అనేక పోషక విలువలు ఉంటయి. తేనెటీగలు పువ్వుల నుంచి మకరందాన్ని సేకరించి తేనెను తయారు చేస్తాయి. అందువల్ల తేనె ఎంతో తియ్యగా ఉంటుంది. దీని వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి.
1. తేనెలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అవి హైబీపీని తగ్గిస్తాయి. బీపీని అదుపులో ఉంచుతాయి. చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా మార్చడంలో తేనె బాగా పనిచేస్తుంది. రోజూ ఉదయాన్నే పరగడుపునే ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ఒక టేబుల్ స్పూన్ తేనెను కలిపి తాగడం వల్ల జీర్ణశక్తి మెరుగు పడుతుంది.
2. తేనెను రోజూ తీసుకోవడం వల్ల శరీరంలో ఎల్‌డీఎల్ (చెడు కొలెస్ట్రాల్) తగ్గుతుంది. హెచ్‌డీఎల్ (మంచి కొలెస్ట్రాల్) పెరుగుతుంది. తేనెలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. అందువల్ల డయాబెటిస్ ఉన్నవారు చక్కెరకు బదులుగా తేనెను వాడవచ్చు.
3. పుండ్లు, కాలిన గాయాలను నయం చేయడంలో తేనె బాగా పనిచేస్తుంది. ఇది మన చర్మాన్ని అనేక విధాలుగా రక్షిస్తుంది. తేనెను చర్మంపై నేరుగా అప్లై చేయవచ్చు. ఎలాంటి హాని కలగదు.
4. దగ్గు, జలుబును తగ్గించేందుకు తేనెను ఔషధంగా ఎప్పటి నుంచో ఉపయోగిస్తున్నారు. ఇది చిన్నారుల్లో వచ్చే దగ్గును కూడా సమర్థవంతంగా తగ్గిస్తుంది. జలుబు సమస్య ఉన్నవారు ఒక టీస్పూన్ చొప్పున తేనె, తులసి ఆకుల రసం, అల్లం రసం కలిపి తీసుకోవడం వల్ల ఆ సమస్య నుంచి తక్షణమే ఉపశమనం లభిస్తుంది.
5. తేనెలో సహజసిద్ధహైన చక్కెరలు ఉంటాయి. అందువల్ల శరీరం వాటిని సులభంగా గ్రహిస్తుంది. శక్తి లభిస్తుంది. చక్కెరకు బదులుగా తేనెను తీసుకోవడం వల్ల శక్తితోపాటు పోషకాలు లభిస్తాయి. ఇతర ప్రయోజనాలను పొందవచ్చు.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365