మనకు తినేందుకు అందుబాటులో అనేక రకాల ఆకుకూరలు ఉన్నాయి. సాధారణంగా చాలా మంది ఆకుకూరలను తినేందుకు ఇష్టపడరు. కానీ తినాల్సినవే అవి. రోజూ ఆహారంలో ఆకుకూరలను తినడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. శరీరానికి పోషణ లభిస్తుంది. ఏయే ఆకుకూరను తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. బచ్చలికూర
బచ్చలికూరను తినడం వల్ల శరీరం చల్లబడుతుంది. వేడి తగ్గుతుంది. కనుక వేసవిలో దీన్ని తప్పకుండా తీసుకోవాలి. ఎండాకాలంలో సహజంగానే శరీరం వేడిగా మారుతుంది. కనుక బచ్చలికూరను తింటే మేలు చేస్తుంది.
2. పాలకూర
శరీరంలో వాత, పిత్త, కఫ దోషాల్లో ఏర్పడే అసమతుల్యతల వల్లే మనకు అనేక అనారోగ్యాలు సంభవిస్తుంటాయి. అయితే పాలకూరను తీసుకుంటే ఆ మూడు దోషాలు సమతుల్యం అవుతాయి. దీంతో అనారోగ్య సమస్యలు తగ్గుతాయి.
3. కరివేపాకు
డయాబెటిస్‌ను అదుపు చేయడంలో కరివేపాకు బాగా పనిచేస్తుంది. రోజుకు 10 ఆకులను పరగడుపునే తింటే మధుమేహం నియంత్రణలో ఉంటుంది. కంటి చూపు మెరుగు పడుతుంది. కళ్ల ఆరోగ్యానికి కరివేపాకు ఎంతగానో మేలు చేస్తుంది. కూరల్లో దీన్ని తీసిపారేస్తారు. కానీ కరివేపాకులను తినాలి. నేరుగా తినలేము అనుకుంటే పొడి రూపంలోనూ తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా ప్రయోజనాలే కలుగుతాయి.
4. తోటకూర
తోటకూరలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. అందువల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. క్యాన్సర్లు రాకుండా ఉంటాయి. అనేక పోషకాలు లభిస్తాయి. అనారోగ్యాల బారిన పడ్డవారు రోజూ తోటకూరను తింటుంటే త్వరగా కోలుకుంటారు.
5. కొత్తిమీర
ఆస్తమా సమస్యతో బాధపడేవారికి కొత్తిమీర ఎంతగానో మేలు చేస్తుంది. దీన్ని నిత్యం తీసుకుంటే ఆస్తమా తగ్గుతుంది. అలాగే జీర్ణ సమస్యలు ఉండవు.
6. పుదీనా
రక్తాన్ని శుద్ధి చేయడంలో పుదీనా ఎంతగానో ఉపయోగపడుతుంది. దీన్ని నేరుగా నమిలి తినవచ్చు. పచ్చడి చేసుకోవచ్చు. రసం రూపంలోనూ తీసుకోవచ్చు. పుదీనా వల్ల నోటి సమస్యల, జీర్ణ సమస్యలు తగ్గుతాయి.
7. గోంగూర
గోంగూరను తినడం వల్ల గుండెకు బలం చేకూరుతుంది. రక్తహీనత సమస్య తగ్గుతుంది. గోంగూరను బాగా ఉడకబెట్టి పుండ్లపై కడితే అవి త్వరగా మానుతాయి.
8. వేపాకు
లేత వేపాకును రోజూ పరగడుపునే తినాలి. దీని వల్ల షుగర్ తగ్గుతుంది. శ్లేష్మం, నోటి దుర్వాసన, దంత సమస్యలు, కడుపులో పురుగులు వంటి సమస్యలు తగ్గుతాయి.
9. దానిమ్మ
దానిమ్మ ఆకులను బాగా దంచి చిన్న చిన్న మాత్రలుగా చేసి తింటుంటే రక్త విరేచనాలు తగ్గుతాయి.
10. సునాముఖి
దీన్ని చారులో వేసి వండుకుని సేవిస్తే మలబద్దకం ఉండదు. గ్యాస్ సమస్య తగ్గుతుంది.
11. కంది
కంది ఆకులను బాగా నూరి పుండ్లపై కడితే అవి త్వరగా మానుతాయి.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365