Bay Leaf : మనం నాన్ వెజ్ వంటకాలను, బిర్యానీలను తయారు చేసేటప్పుడు మసాలా దినుసులను ఉపయోగిస్తూ ఉంటాం. మనం వంటల తయారీలో ఉపయోగించే మసాలా దినుసులలో బిర్యానీ ఆకు కూడా ఒకటి. దీనిని ఆకు పత్రి, తేజపత్రి అని కూడా పిలుస్తారు. దీనిని ఇండియన్ బే లీఫ్, మలబార్ లీఫ్ అని కూడా అంటుంటారు. బిర్యానీ ఆకు మనకు ఎల్లవేళలా లభిస్తూనే ఉంటుంది. బిర్యానీ ఆకు వంట రుచిని పెంచడమే కాకుండా మనకు వచ్చే వాత, కఫ, పిత్త సంబంధమైన అనారోగ్య సమస్యలను కూడా సమర్థవంతంగా నయం చేస్తుందని ఆయుర్వేద నిపుణలు చెబుతున్నారు.
రక్తాన్ని శుద్ది చేసి నరాలకు కొత్త శక్తిని ఇవ్వడంలో, పురుషులల్లో వచ్చే సంతానలేమి సమస్యలను తగ్గించడంలో బిర్యానీ ఆకు దివ్యౌషధంగా పని చేస్తుందని వారు చెబుతున్నారు. పురుషులలో వచ్చే నపుంసకత్వాన్ని, శీఘ్రస్కలనాన్ని నయం చేయడంలో బిర్యానీ ఆకు ఎంతో ఉపయోగపడుతుంది. బిర్యానీ ఆకు కలిగిన ఔషధ గుణాలలో మొదటిది నత్తని తగ్గించడం. మాటలు సరిగ్గా రాకపోవడం, ఉచ్ఛారణ లోపాలు, స్వరపేటిక లోపాలను బిర్యానీ ఆకు నయం చేస్తుంది.
బిర్యానీ ఆకును శుభ్రపరిచి ముక్కలుగా చేసి నోటిలో వేసుకుని నములుతూ.. వచ్చిన రసాన్ని మింగడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. నోటి దుర్వాసన సమస్య తగ్గుతుంది. బిర్యానీ ఆకుకు స్త్రీలలో వచ్చే గర్భాశయ సమస్యలను కూడా నయం చేసే శక్తి ఉంది. బిర్యానీ ఆకు చూర్ణాన్ని తేనెతో కలిపి తీసుకోవడం వల్ల జీర్ణాశయ సంబంధిత సమస్యలు తగ్గుతాయి. చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. రక్తం శుద్ది అవుతుంది. శరీరం నుండి వచ్చే దుర్వాసన తగ్గుతుంది. నీరసం కూడా తగ్గుతుంది.
రోజూ తయారు చేసే టీ లో బిర్యానీ ఆకుల పొడిని, దాల్చిన చెక్క పొడిని వేసి టీ ని తయారు చేసుకుని తాగడం వల్ల శరీరంలో పేరుకు పోయిన కొవ్వు కరిగి సన్నగా తయారవుతారు. ఇలా తయారు చేసుకున్న టీ ని తాగడం వల్ల మానసిక స్థితి కూడా మెరుగుపడుతుంది. జీర్ణాశయాన్ని శుభ్రపరచడంలో, బాలింతలలో పాలు ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేయడంలో కూడా బిర్యానీ ఆకు ఉపయోగపడుతుంది. శరీరంలోని ప్రతి అవయావాన్ని కూడా బలంగా తయారు చేసే శక్తి బిర్యానీ ఆకుకు ఉందని.. దీనిని తగిన విధంగా ఉపయోగించడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు.