Sesame Seeds Oil : నువ్వుల నూనెతో ఉప‌యోగాలు ఎన్నో.. త‌ప్ప‌క వాడాలి..!

Sesame Seeds Oil : పూర్వ‌కాలంలో వంట‌ల త‌యారీలో ఎక్కువ‌గా వాడిన నూనెల్లో నువ్వుల నూనె కూడా ఒక‌టి. నువ్వుల‌ను గానుగ‌లో ఆడించి ఈ నూనెను తీస్తారు. నువ్వుల నూనె ఎంతో ఆరోగ్య‌క‌ర‌మైంది. దీనిని ఆహారంగా శ‌రీరం లోప‌లికి తీసుకోవ‌చ్చు. అలాగే శ‌రీరం బ‌య‌ట కూడా దీనిని ఉప‌యోగించ‌వ‌చ్చు. నువ్వుల నూనెను ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. మ‌న శ‌రీర ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. ఆయుర్వేదంలో ఔష‌ధంగా కూడా దీనిని ఉప‌యోగిస్తారు. కానీ ప్ర‌స్తుత కాలంలో ఈ నువ్వుల నూనెను చాలా త‌క్కువగా ఉప‌యోగిస్తున్నారు. క‌నుక మ‌నం అనేక రోగాల బారిన ప‌డుతున్నామ‌ని నిపుణులు చెబుతున్నారు.

అస‌లు ఈ నువ్వుల నూనె వ‌ల్ల కలిగే ఉప‌యోగాలు ఏమిటి.. దీనిని ఎందుకు ఉప‌యోగించాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. నువ్వుల నూనెను ఉయోగించ‌డం వల్ల బ‌లం, దేహ పుష్టి క‌లుగుతాయి. ఈ నూనెను వాడ‌డం వ‌ల్ల పురుషుల్లో వీర్య క‌ణాల సంఖ్య వృద్ధి చెందుతుంది. స్త్రీల‌లో బ‌హిష్టు స‌రిగ్గా వ‌స్తుంది. ఒంటికి ప‌ట్టిన నీటిని త‌గ్గిస్తుంది. అన్ని ర‌కాల చ‌ర్మ వ్యాధుల‌ను, క్రిమి రోగాల‌ను, వాత రోగాల‌ను న‌యం చేస్తుంది. కంటి చూపును మెరుగుప‌ర‌చ‌డంలో, జుట్టును ఆరోగ్యంగా ఉంచ‌డంలో కూడా నువ్వుల నూనె ఉప‌యోగ‌ప‌డుతుంది. ఈ నూనెను వాడేట‌ప్పుడు త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.

amazing health benefits of Sesame Seeds Oil
Sesame Seeds Oil

ఈ నూనెలో హార‌తి కర్పూరాన్ని కానీ, త‌మ‌ల‌పాకును కానీ క‌ల‌ప‌కూడ‌దు. అలా క‌ల‌ప‌డం వ‌ల్ల నువ్వుల నూనె విషంగా మారుతుంది. ఈ విధంగా ఎవ‌రైనా క‌లిపి తీసుకుంటే ఆ విషానికి విరుగుడుగా గంజిని కానీ తేనె క‌లిపిన నీటిని కానీ తాగించాలి. ఆయుర్వేదంలో అనేక ర‌కాల తైలాల‌ను త‌యారు చేయ‌డంలో నువ్వుల నూనెను ఉప‌యోగిస్తారు. శ‌రీరానికి ఈ నువ్వుల నూనెతో మ‌ర్ద‌నా చేయ‌డం వల్ల చ‌ర్మం బిగుతుగా మారుతుంది. ప్ర‌స్తుత కాలంలో ఈ నూనెను కూడా క‌ల్తీ చేస్తున్నారు. క‌నుక దీనిని బాహ్యంగానే ఎక్కువ‌గా ఉప‌యోగించాలి. ఈ నువ్వుల నూనెను ఉయోగించ‌డం వ‌ల్ల పుష్టిగా, ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు. క‌నుక దీనిని త‌ప్ప‌కుండా వాడాల‌ని నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts