Spring Onions : దగ్గు, జలుబు, కొలెస్ట్రాల్‌, హైబీపీ.. అన్నింటికీ ఉల్లికాడలతో చెక్‌..!

Spring Onions : ఉల్లిపాయలను సహజంగానే రోజూ ప్రతి ఒక్కరూ కూరల్లో వేస్తుంటారు. ఉల్లిపాయ లేకుండా ఏ కూర పూర్తి కాదు. ఉల్లిపాయలను కొందరు రోజూ పచ్చివే తింటుంటారు. అయితే ఉల్లిపాయలే కాదు.. ఉల్లికాడలతోనూ మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. వాటితో ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

amazing health benefits of Spring Onions
Spring Onions

1. ఉల్లికాడలనే స్ప్రింగ్‌ ఆనియన్స్‌ అంటారు. చైనా, జపాన్‌ దేశాలకు చెందిన వారు ఎక్కువగా వీటిని ఉపయోగిస్తుంటారు. వారు తయారు చేసుకునే సూప్‌లు, సలాడ్స్‌లో వీటిని ఎక్కువగా వేస్తుంటారు. దీంతో చక్కని రుచి పొందడమే కాదు, అనేక పోషకాలను శరీరానికి అందించవచ్చు. దీంతో అనేక వ్యాధులు రాకుండా ఆరోగ్యంగా ఉంటారు.

2. ఉల్లిపాయలతో పోలిస్తే ఉల్లి కాడల్లో సల్ఫర్‌ అధికంగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. దీంతో హార్ట్‌ ఎటాక్‌లు రాకుండా ఉంటాయి. అలాగే బీపీ అదుపులో ఉంటుంది. దీని వల్ల గుండె ఆరోగ్యంగా, సురక్షితంగా ఉంటుంది.

3. దగ్గు, జలుబు వంటి సీజనల్‌ వ్యాధులతో బాధపడేవారు ఉల్లికాడలతో సూప్‌ తయారు చేసుకుని తాగితే ఆయా సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. అయితే పచ్చి ఉల్లికాడల రసం తీసి దాన్ని ఒక టీస్పూన్‌ మోతాదులో తీసుకుని, అందులో అంతే మొత్తంలో తేనె కలిపి తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీనివల్ల ఇన్‌ఫెక్షన్లు రాకుండా చూసుకోవచ్చు.

4. ఉల్లికాడల్లో పెక్టిన్‌ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది పెద్ద పేగుల్లోని సున్నితమైన పొరలను రక్షిస్తుంది. దీంతో పెద్ద పేగ క్యాన్సర్‌ రాకుండా ఉంటుంది. జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతంది.

5. పచ్చి ఉల్లికాడలను చిన్న ముక్కలుగా కట్‌ చేయాలి. వాటిని రెండు టీస్పూన్ల మోతాదులో తీసుకుని ఒక కప్పు పెరుగులో కలపాలి. తరువాత ఆ మిశ్రమాన్ని తినేయాలి. ఇలా రోజుకు ఒకసారి చేయాలి. దీంతో పైల్స్‌ సమస్య తగ్గుతుంది.

Share
Admin

Recent Posts