Potatoes : బంగాళదుంపల్ని చాలామంది ఇష్టపడతారు. బంగాళదుంపతో రకరకాల వంటకాలు చేసుకోవచ్చు. కూర, ఫ్రై, చిప్స్ ఇలా మనకి నచ్చినవి మనం తయారు చేసుకోవచ్చు. అయితే, బంగాళదుంపని ఇష్ట పడి, చాలామంది ఎక్కువగా బంగాళదుంపల్ని తీసుకుంటూ ఉంటారు. బంగాళాదుంపల్ని ఎక్కువ తింటే, బరువు పెరిగే అవకాశం ఉందని వైద్యులు అంటున్నారు. బరువు పెరగడం వలన అనేక సమస్యలు కలుగుతాయి. బంగాళదుంపల్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ పరిమాణం వలన, కొవ్వు కూడా బాగా పెరిగిపోతుంది ఊబకాయం కలుగుతుంది.
ప్రాసెస్ చేసిన బంగాళాదుంపలు సాధారణంగా వాడే బంగాళదుంపల కంటే, ప్రమాదకరమైనవి. వీటితో చిప్స్ ఇతర ఫాస్ట్ ఫుడ్స్ ని తయారు చేస్తారు. ఎక్కువగా బంగాళదుంపలు తిన్న పిల్లలులో ఉబకాయం వస్తుంది. పైగా అనేక రకాల వ్యాధులు వస్తున్నాయి. ఎక్కువగా, బంగాళదుంపల్ని తీసుకుంటే, ఆరోగ్యానికి మంచిది కాదు. డయాబెటిస్ ఉన్నవాళ్లు, బంగాళాదుంపలు అసలు ఎక్కువ తీసుకోకూడదు. అధిక మోతాదులో బంగాళదుంపల్ని డయాబెటిస్ ఉన్న వాళ్ళు తీసుకుంటే, చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి.
ఎలాంటి వ్యాధి లేని వ్యక్తి వారంలో రెండు రోజులు బంగాళదుంపలు తీసుకోవచ్చు. రోజు శారీరక శ్రమ లేదంటే వ్యాయామం చేసే వాళ్ళు, మూడు రోజులు తీసుకోవచ్చు. వీలైనంత వరకు ఉడికించిన దుంపల్ని మాత్రమే తీసుకోవడానికి ట్రై చేయాలి. ఎసిడిటీ సమస్యతో బాధపడే వాళ్ళు మాత్రం బంగాళాదుంపల్ని తీసుకోవద్దు. లిమిట్ గా మాత్రమే తీసుకోవాలి. ఎప్పుడు కూడా ఏ ఆహార పదార్థాలు అయినా సరే తగిన మోతాదులో మాత్రమే తీసుకోవాలి. అధికంగా తీసుకుంటే సమస్యలు తప్పవు.
బంగాళదుంపల్ని తింటే, శరీరంలో స్టార్చ్ పరిమాణం పెరుగుతుంది. జీవక్రీని ఇది పెంచుతుంది. కానీ, లిమిట్ గా మాత్రమే తీసుకోవాలని గుర్తుపెట్టుకోండి. చాలామంది తల్లిదండ్రులు పిల్లల కేవలం బంగాళదుంపలు మాత్రమే తింటున్నారు అని, రోజు బంగాళదుంపల్ని వండి పెడుతూ ఉంటారు. అన్ని రకాల పోషక పదార్థాలు అందాలంటే, అన్ని రకాల ఆహార పదార్థాలను ఇవ్వాలి. కేవలం బంగాళాదుంపలు ఇస్తే సరిపోదు. పైగా బంగాళదుంపల వలన ఎన్ని సమస్యలు ఉన్నాయి. కాబట్టి, బంగాళదుంపల్ని లిమిట్ గా మాత్రమే తీసుకోవాలని గుర్తుపెట్టుకోండి.