Arjuna Tree Bark For Heart : ప్రస్తుత కాలంలో మనలో చాలా మంది మరణాలకు కారణమవుతున్న అనారోగ్య సమస్యల్లో గుండెపోటు కూడా ఒకటి. దీని కారణంగా మరణించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుందనే చెప్పవచ్చు. మారిన జీవన విధానం, ఆహారపు అలవాట్లే ఈ సమస్య బారిన పడడానికి ప్రధాన కారణమని చెప్పవచ్చు. వ్యాయామం చేయకపోవడం, జంక్ ఫుడ్ ను , నూనెలో వేయించిన పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం, మద్యం సేవించడం, నిద్రలేమి, ఆందోళన, ఒత్తిడి వంటి వాటిని కూడా ఈ సమస్య బారిన పడడానికి కారణాలుగా చెప్పవచ్చు. చాలా మంది మనం తీసుకునే ఆహారం సరైనదేనని భావిస్తూ ఉంటారు. కానీ వారికి గుండెనొప్పి వచ్చే వరకు తెలియదు వారు తీసుకునే ఆహారం సరైనది కాదని వారు పాటించే జీవన విధానం సరైనది కాదని.
గుండెపోటు బారిన పడకుండా ఉండాలంటే భవిష్యత్తులో మనకు ఈ సమస్య రాకుండా ఉండాలంటే మనం ముందు నుండి కొన్ని చిట్కాలను పాటించాలి. అలాగే మనం తీసుకునే ఆహారం విషయంలో కూడా నియమాలు పాటించాలి. గుండెపోటు రాకుండా ఉండాలంటే మనం పాటించాల్సిన చిట్కాలు, నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అర్జున చెట్టు బెరడు.. దీని గురించి మనలో చాలా మందికి తెలిసి ఉంటుంది. ఆయుర్వేదంలో ఎంతో కాలంగా దీనిని ఔషధంగా ఉపయోగిస్తున్నారు. ఛాతిలో నొప్పి, హైపర్ టెన్షన్ ను తగ్గించడంలో గుండె వైఫల్యం కాకుండా చేయడంలో రక్తనాళాల్లో అడ్డంకులను తొలగించడంలో ఇలా అనేక విధాలుగా అర్జున చెట్టు బెరడు మనకు సహాయపడుతుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో, గుండె దీర్ఘకాలం పాటు చక్కగా పని చేసేలా చేయడంలో ఈ బెరడు మనకు దోహదపడుతుంది.ఈ బెరడును ఎలాగైనా ఉపయోగించవచ్చు.

మనకు మార్కెట్ లో అర్జున చెట్టు బెరడు టానిక్ రూపంలో, క్యాప్సుల్స్ రూపంలో కూడా లభిస్తాయి. వీటిని నేరుగా తీసుకోవచ్చు లేదా ఈ చెట్టు బెరడును రాత్రంతా నీటిలో నానబెట్టి తీసుకోవచ్చు లేదా బెరడుతో టీ ని తయారు చేసుకుని తాగవచ్చు. అయితే పిల్లలు, గర్భిణీ స్త్రీలు ఈ బెరడును తీసుకోకపోవడమే మంచిది. అలాగే గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో ఎండు ద్రాక్ష కూడా మనకు ఎంతో సహాయపడుతుంది. అధిక రక్తపోటు, ఛాతిలో నొప్పి, అధిక కొలెస్ట్రాల్ వంటి సమస్యలను తగ్గించడంలో ఇవి ఎంతో దోహదపడతాయి. ఎండు ద్రాక్ష తీసుకోవడం వల్ల మన శరీరంలో నైటిక్ర్ యాసిడ్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీంతో రక్తపోటు అదుపులో ఉండడంతో పాటు రక్తనాళాలు ఎక్కువగా వ్యాకోచిస్తాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు రక్తహీనతను, ఎసిడిటీని తగ్గించడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా ఎండు ద్రాక్ష మనకు సహాయపడుతుంది.
రోజూ 6 నుండి 8 ఎండు ద్రాక్షలను రాత్రిపడుకునే ముందు గోరు వెచ్చని నీటిలో వేసి నానబెట్టాలి. ఉదయాన్నే ఈ నీటిని తాగి ఎండు ద్రాక్షను నమిలి తినాలి. ఈ విధంగా ఎండు ద్రాక్షను తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే రెండు లవంగాలను ఒక గ్లాస్ నీటిలో వేసి బాగా మరిగించాలి. తరువాత ఈ లవంగాలను తిని ఈ నీటిని టీ తాగినట్టు చప్పరిస్తూ తాగాలి. ఇలా తీసుకోవడం వల్ల కూడా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో వెల్లుల్లి కూడా మనకు ఎంతో ఉపయోగపడుతుంది. వెల్లుల్లిలో ఎన్నో పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో, రక్తాన్ని పలుచగా చేయడంలో, షుగర్ ను అదుపులో ఉంచడంలోఇలా అనేక రకాలుగా వెల్లుల్లి మనకు దోహదపడుతుంది.
అలాగే గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ముల్లేటి, అల్లం, ఉసిరి, లవంగాలు, దాల్చిన చెక్క, తులసి ఆకులు కూడా ఎంతో సహాయపడతాయి. వీటితో కషాయం తయారు చేసుకుని తాగడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. వీటితో పాటు ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. నూనె పదార్థాలను, జంక్ ఫుడ్ ను తక్కువగా తీసుకోవాలి. చక్కటి జీవన విధానాన్ని పాటించాలి. పండ్లను, కూరగాయలను ఎక్కువగా ఆహారంగా తీసుకోవాలి. ఈ విధంగా ఈ చిట్కాలను పాటించడం వల్ల గుండె సమస్యలు రాకుండా ఉంటాయి.