Asthma Health Tips : ఇస్నోఫిల్స్.. రక్తంలో ఉండే తెల్ల రక్తకణాల్లో ఇవి కూడా ఒకటి. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో ఇవి మనకు సహాయపడతాయి. అయితే కొందరిలో రక్తంలో ఈ ఇస్నోఫిల్స్ ఎప్పుడూ కూడా అధిక పరిమాణంలో ఉంటాయి. రక్తపరీక్షలు చేయించడం వల్ల ఇస్నోఫిల్స్ అధిక పరిమాణంలో ఉన్నాయని మనకు తెలుస్తుంది. శరీరంలో జలుబు, దగ్గు, శ్లేష్మం, కఫం, ఆస్థమా వంటి ఇన్పెక్షన్ పెరిగినప్పుడు రక్తంలో ఇస్నోఫిల్స్ అధిక మొత్తంలో ఉంటాయి. అయితే కొందరిలో జన్యుపరంగా ఎప్పుడూ కూడా జలుబు, పడిశం, పిల్లి కూతలు, కఫం, శ్లేష్మం వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఇలా బాధపడే వారిలో రక్తంలో ఎల్లప్పుడూ ఇస్నోఫిల్స్ అధిక మొత్తంలో ఉంటాయి.
ఇటువంటి సమస్యతో బాధపడే వారు రక్తంలో ఇస్నోఫిల్స్ మోతాదును తగ్గించుకోవాలనుకునే వారు పంచదార, చల్లటి పదార్థాలు, చాక్లెట్స్, స్వీట్స్ వంటి వాటిని తీసుకోకూడదు. తీపి పదార్థాలు ఇన్పెక్షన్ కు కారణమయ్యే శ్లేష్మాలను ఇంకా వృద్ది చేస్తాయి. రక్తంలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది. కనుక ఇటువంటి సమస్యతో బాధపడే వారు పంచదారను, చల్లటి పదార్థాలను తీసుకోవడం పూర్తిగా మానేయాలి. పంచదారకు బదులుగా ఖర్జూరం పొడిని, తేనెను వాడుకోవాలి. ఇలా చేయడం వల్ల శ్లేష్మాలు, కఫం పెరగకుండా ఉంటుంది. అయితే స్వచ్ఛమైన తేనెను మాత్రమే ఎంచుకుని తీసుకోవాలి. అలాగే చల్లటి నీటిని తాగకూడదు. ఎల్లప్పుడూ వేడి నీటిని, కాచి చల్లార్చిన నీటిని తీసుకోవాలి. అలాగే ఈ ఇస్నోఫిలియా సమస్యతో బాధపడే వారు ఎప్పుడూ చల్లటి నీటిని స్నానానికి ఉపయోగించకూడదు. వేడి నీటితో మాత్రమే స్నానం చేయాలి.
అలాగే స్టీమ్ బాత్ వంటి వాటిని చేయాలి. స్టీమ్ బాత్ చేయడం వల్ల రక్తంలో ఇస్నోఫిల్స్ పరిమాణం తగ్గుతుందని నిపుణులు పరిశోధనల ద్వారా వెల్లడించారు. ఇలా చేయడం వల్ల ఇస్నోఫిలియా సమస్య నుండి చక్కటి ఉపశమనం కలుగుతుంది. వీటితో పాటు సమస్య మరీ తీవ్రంగా ఉన్నవారు తేనె నీటిని తీసుకుంటూ నాలుగు రోజుల పాటు ఉపవాసం చేయడం మరీ మంచిదని నిపుణులు చెబుతున్నారు. తేనె, నిమ్మరసం కలిపిన నీటిని తీసుకోవడం వల్ల ఇన్పెక్షన్ తగ్గుతుంది. రోజులో 6 నుండి 7 సార్లు ఇలా తేనె, నిమ్మరసం కలిపిన నీటిని తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల రక్తంలో ఇస్నోఫిల్స్ సంఖ్య చాలా వరకు తగ్గుతుంది. శరీరంలో ఇన్పెక్షన్స్ తగ్గడంతో పాటు రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇస్నోఫిలీయా సమస్యతో బాధపడే వారు ఈ విధమైన చిట్కాలను పాటించడం వల్ల చాలా సులభంగా సమస్య నుండి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు.