Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home హెల్త్ టిప్స్

యాంటీ బయోటిక్స్‌, యాంటీ వైరల్‌ మందులను ఎక్కువగా వాడితే ముప్పే.. ఈ సహజసిద్ధమైన పదార్థాలను తీసుకోండి..!

Admin by Admin
June 20, 2021
in హెల్త్ టిప్స్
Share on FacebookShare on Twitter

మనకు పలు రకాల వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు బాక్టీరియా, వైరస్‌ల వల్ల వస్తాయన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వైద్యులు అందుకు యాంటీ బయోటిక్స్, యాంటీ వైరల్‌ మందులను ఇస్తుంటారు. అయితే కొందరు డాక్టర్‌ సూచించకున్నా ఇన్‌ఫెక్షన్‌ వచ్చిందని చెప్పి పదే పదే ఆయా మందులను వాడుతుంటారు. కానీ నిజానికి అలా వాడడం ప్రమాదకరం. ఎప్పటికీ అలా ఆ మందులను వాడితే కొంత కాలం తరువాత బాక్టీరియా, వైరస్‌లకు ఆ మందులు పనిచేయవు. అవి ఆ మందులకు నిరోధకతను పెంచుకుంటాయి. దీంతో కొత్త మందులను వాడాల్సి వస్తుంది. ఇది ఒక చక్రంలా సాగుతుంది. చివరకు మనం ఏ మందులు మింగినా అసలు పనిచేయకుండా పోతాయి. అందుకనే యాంటీ బయోటిక్‌, యాంటీ వైరల్‌ మందులను ఎక్కువగా వాడొద్దని, ముఖ్యంగా డాక్టర్‌ సూచన లేకుండా అస్సలు వాడొద్దని చెబుతుంటారు. మరలాంటప్పుడు ఏం చేయాలి ? ఇన్‌ఫెక్షన్లను తగ్గించుకునేందుకు మార్గం ఏమిటి ? అంటే.. అందుకు కింద తెలిపిన చిట్కాలను పాటించవచ్చు. దీంతో ఇన్‌ఫెక్షన్లు, వ్యాధులు తగ్గుతాయి. మరి ఆ చిట్కాలు ఏమిటంటే..

avoid anti biotics and anti viral medicines take these natural foods

దగ్గు, జలుబు వచ్చిందంటే కొందరు మెడిసిన్లను వేసుకుంటారు. కానీ అందుకు పలు చిట్కాలు ఉన్నాయి. అవేమిటంటే..

1. రెండు లేదా మూడు వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా వామును ఆవనూనెలో వేసి వేడి చేయాలి. ఆ మిశ్రమాన్ని పాదాలు, వెన్ను, ఛాతిపై రాయాలి. దీంతో దగ్గు, జలుబు తగ్గుతాయి. ఈ మిశ్రమాన్ని పిల్లలకు కూడా వాడవచ్చు.

2. అల్లం రసం ఒక టీస్పూన్‌, తేనె ఒక టీస్పూన్‌ కలిపి తీసుకుంటుంటే జలుబు, ఫ్లూ తగ్గుతాయి.

3. ఉప్పు నీటిని గొంతులో పోసి పుక్కిలించడం ద్వారా గొంతు సమస్యలను తగ్గించుకోవచ్చు.

ఇక ఇవే కాకుండా బాక్టీరియా, వైరస్‌ల ద్వారా వచ్చే ఇన్‌ఫెక్షన్లను తగ్గించేందుకు వెల్లుల్లి, పసుపు, అల్లం బాగా పనిచేస్తాయి. తిప్పతీగ రసం కూడా ఇన్‌ఫెక్షన్లను తగ్గిస్తుంది. జామ ఆకుల నీళ్లు, మునగ ఆకుల నీళ్లు, వాము నీళ్లు, జీలకర్ర నీళ్లు, దాల్చిన చెక్క నీళ్లను తాగడం ద్వారా కూడా బాక్టీరియా, వైరస్‌ ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే విటమిన్‌ ఎ, సి, ఇ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. దీంతోకూడా ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Tags: anti bioticsanti viralsmedicinenatural foodsమందులుయాంటీ బ‌యోటిక్స్‌యాంటీ వైర‌ల్స్‌స‌హ‌జ‌సిద్ధ‌మైన ప‌దార్థాలు
Previous Post

షుగర్‌ లెవల్స్‌ను తగ్గించే మామిడి ఆకులు.. ఎలా ఉపయోగించాలంటే..?

Next Post

ఉద‌యాన్నే ఈ ఆహారాల‌ను బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకోండి.. బ‌రువు త‌గ్గుతారు..!

Related Posts

హెల్త్ టిప్స్

పాదాల వాపులు ఉన్నాయా.. అయితే ఇలా చేయండి చాలు..

June 3, 2025
హెల్త్ టిప్స్

మీరు రోజూ తినే ఆహారంలో ఈ మార్పులు చేసుకోండి.. క‌చ్చితంగా బ‌రువు త‌గ్గుతారు..

June 2, 2025
హెల్త్ టిప్స్

బ‌రువు త‌గ్గాల‌ని చూస్తున్న‌వారు వీటిని డైట్‌లో క‌చ్చితంగా చేర్చుకోవాల్సిందే..!

June 2, 2025
హెల్త్ టిప్స్

40 ఏళ్లు దాటిన వారు క‌చ్చితంగా పాటించాల్సిన ఆరోగ్య సూత్రాలు ఇవి..!

June 2, 2025
హెల్త్ టిప్స్

ఏ సీజ‌న్‌లో అయినా స‌రే కొబ్బ‌రి నీళ్ల‌ను రోజూ తాగాల్సిందే.. ఎందుకంటే..?

June 1, 2025
హెల్త్ టిప్స్

ఫ్రిజ్ లో ఈ వ‌స్తువుల‌ను ఎట్టి ప‌రిస్థితిలోనూ పెట్ట‌కూడ‌దు..

June 1, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
పండ్లు

అంజీర్ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు

by Admin
December 6, 2021

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Date Seeds : ఖ‌ర్జూరాల‌ను తింటే వాటిల్లో ఉండే విత్త‌నాల‌ను ప‌డేయ‌కండి.. ఎందుకంటే..?

by Editor
December 25, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!