Barley Water Health Benefits : బార్లీ నీళ్లు తాగితే, ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది. బార్లీ నీళ్ళని రెగ్యులర్ గా తీసుకోవడం వలన, ఎన్నో లాభాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. పూర్వకాలంలో, బార్లీ గింజలను ఎక్కువగా ఉపయోగించేవారు. కానీ, ఈ రోజుల్లో ఆహారం విషయంలో ఎన్నో మార్పులు వచ్చాయి. బార్లీ గింజల వాడకం బాగా ఎక్కువైంది. ఈ రోజుల్లో ఆరోగ్యానికి మేలు చేసే వాటిని అంతా తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ రోజుల్లో తృణధాన్యాలు, గింజలు మొదలైన వాటిని తీసుకోవడానికి చూస్తున్నారు. ఆరోగ్యం బాగుండడానికి ఆరోగ్యానికి మేలు చేసే, ఆహార పదార్థాలను తీసుకుంటున్నారు. అయితే, గోధుమల కంటే బార్లీ గింజల్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.
బార్లీ నీళ్లు తాగడం వలన, శరీరంలో వ్యర్థాలు తొలగిపోయి, పెద్ద పేగు క్లీన్ అవుతుంది. శరీరంలో వేడి కూడా ఈ నీళ్లు తాగితే తగ్గుతుంది. కడుపులో గ్యాస్, కడుపు ఉబ్బరం, కడుపునొప్పి వంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే కూడా బార్లీ నీళ్లు తాగితే తగ్గుతాయి. డయాబెటిస్ ఉన్నవాళ్లు, ప్రతిరోజూ దీన్ని తాగడం వలన చక్కెర స్థాయిలో నియంత్రణలో ఉంటాయి. అలానే, డయాబెటిస్ వలన వచ్చే నీరసం, అలసట కూడా తగ్గిపోతాయి.
బార్లీ నీళ్లను తాగితే, ఒకటి కాదు రెండు కాదు అనేక లాభాలను పొందవచ్చు. మూత్ర సంబంధిత సమస్యలు కూడా, లేకుండా ఉండొచ్చు. రక్తంలో కొలెస్ట్రోల్ లేకుండా చేస్తుంది ఇది. అలానే, రక్త ప్రసరణ బాగా జరిగేటట్టు కూడా చూస్తుంది.
బార్లీ నీళ్లు తయారు చేసుకోవడానికి, రెండు స్పూన్లు బార్లీ గింజల్ని ఒక రెండు గ్లాసు నీళ్ళల్లో వేసి, ఐదు నుండి ఏడు నిమిషాల పాటు మరిగించుకోవాలి. తర్వాత, వడకట్టేసి నిమ్మరసం, తేనె వేసుకుంటే సరిపోతుంది. ఇలా సులభంగా ఈ బార్లీ నీళ్ళని తాగి ఈ ప్రయోజనాలని పొందొచ్చు. అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు.