ఇప్పుడంటే చాలా మంది మంచాల మీద, డైనింగ్ టేబుల్స్ లేదా కుర్చీల్లో కూర్చుని భోజనాలు చేస్తున్నారు. కానీ ఒకప్పుడు మన పెద్దలు, పూర్వీకులు నేలపై కూర్చుని చక్కగా భోజనం చేసేవారు. అయితే ఆయుర్వేద ప్రకారం నిజానికి నేలపై కూర్చుని భోజనం చేయడమే మంచిది. దీంతో అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. నేలపై కూర్చుని భోజనం చేయడం వల్ల జీర్ణక్రియ మెరుగు పడుతుంది. జీర్ణ సమస్యలు ఉన్నవారు నేలపై కూర్చుని భోజనం చేస్తుండాలి. దీంతో ఆ సమస్యల నుంచి బయట పడవచ్చు.
2. నేలపై కూర్చుని భోజనం చేయడం వల్ల ఆహారం తక్కువగా తింటారు. ఇది అధిక బరువును తగ్గించుకునేందుకు సహాయం చేస్తుంది.
3. నేలపై కూర్చుని భోజనం చేస్తే శరీరం దృఢంగా మారుతుంది. తినే ఆహారం సరిగ్గా ఒంట బడుతుంది. అనారోగ్యాలు రాకుండా చూసుకోవచ్చు.
4. యురోపియన్ జర్నల్ ఆఫ్ ప్రివెంటివ్ కార్డియాలతో ప్రచురితమైన కథనం ప్రకారం.. నేలపై కూర్చుని భోజనం చేయడం వల్ల ఆయుష్షు పెరుగుతుందని వెల్లడైంది. కనుక నేలపై కూర్చునే భోజనం చేయాలి.
5. నేలపై కూర్చోవడం వల్ల సుఖాసన స్థితిలో ఉంటారు. దీంతో మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఫలితంగా ఒత్తిడి, ఆందోళన లేకుండా భోజనం చేస్తారు. ఎంత తింటున్నది, ఏం తింటున్నది తెలుస్తుంది. ప్రశాంతంగా భోజనం చేయవచ్చు. గ్యాస్ సమస్య రాకుండా ఉంటుంది.