Black Garlic : మనం వంట్లలో వెల్లుల్లిని వాడుతూ ఉంటాము. వెల్లుల్లిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. మనం సాధారణంగా వాడే వెల్లుల్లి తెలుపు రంగులో ఉంటుంది. ఇది మనందరికి తెలిసిందే. కానీ నల్ల వెల్లుల్లి గురించి మనలో చాలా మందికి తెలియదు. ఇది ఒక కూడా ఒక సాధారణమైన వెల్లుల్లే. ఇది చూడడానికి నల్లగా ఉంటుంది. మనం వాడే వెల్లుల్లిని పులియబెట్టి దీనిని తయారు చేస్తారు. కిణ్వ ప్రక్రియ ద్వారా నల్ల వెల్లుల్లిని తయారు చేస్తారు. దీనిలో జరిగే మెయిలార్డ్ ప్రతిచర్య, కారమెలైజేషన్ కారణంగా వెల్లుల్లి రుచి, వాసన, ఘాటు తగ్గుతుంది. సాధారణ వెల్లుల్లి వలె నల్ల వెల్లుల్లి కూడా మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. నల్ల వెల్లుల్లిలో ఎస్ అల్లైల్ సిస్టీన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.
ఇవి శరీరంలోని ఫ్రీరాడికల్స్ తో పోరాడి కణాల ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. నల్ల వెల్లుల్లిని తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధకశక్తి పెరుగుతుంది. ఇన్పెక్షన్ లు తగ్గుతాయి. అలాగే నల్ల వెల్లుల్లిలో యాంటీ ఇన్ ప్లామేటరీ లక్షణాలు కూడా పుష్కలంగా ఉంటాయి. శరీరంలో ఇన్ ప్లామేషన్ ను తగ్గించడంలో శరీరాన్ని అనారోగ్య సమస్యల బారిన పడకుండాకాపాడడంలో నల్ల వెల్లుల్లి మనకు ఎంతో సహాయపడుతుంది. అలాగే నల్ల వెల్లుల్లిని తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
అలాగే దీనిని తీసుకోవడం వల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతక అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాము. ఈ విధంగా నల్ల వెల్లుల్లి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని దీనిని కూడా ఆహారంలో భాగంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. నల్ల వెల్లుల్లిని సలాడ్స్, సూప్స్, టోస్ట్ వంటి వాటితో తీసుకోవచ్చు. ఇది తీపి రుచిని కలిగి ఉంటుంది కనుక నేరుగా నమిలి కూడా తినవచ్చని నిపుణులు చెబుతున్నారు.