హెల్త్ టిప్స్

Black Salt : ఈ ఉప్పు గురించి తెలుసా.. ఎన్ని ప్ర‌యోజ‌నాలో తెలిస్తే.. అస‌లు న‌మ్మ‌లేరు..!

Black Salt : నల్ల ఉప్పును ఎక్కువగా రెస్టారెంట్లలో వాడుతూ ఉంటారు. ఇది మంచి ఫ్లేవర్‌తోపాటు మంచి రుచిని కూడా ఇస్తుంది. నల్ల ఉప్పులో ఎన్నో ఆరోగ్యక‌ర‌మైన‌ ప్రయోజనాలు ఉన్నాయి. నల్ల ఉప్పును ఎక్కువగా ఆయుర్వేదంలో వాడతారు. నల్ల ఉప్పు వాడకం ఈ మధ్య కాలంలో పెరిగింది. నల్ల ఉప్పు వాడడం వలన కాలేయంలో పిత్త ఉత్పత్తికి సహాయపడటం ద్వారా జీర్ణక్రియకు మేలు చేస్తుంది. అలాగే చిన్న ప్రేగులలో జరిగే శోషణ ప్రక్రియలను మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. పొటాషియం సమృద్దిగా ఉండుట వలన కండరాల నొప్పులను తగ్గించడంలో, కండరాలు సరిగా పనిచేయడంలో సహాయపడుతుంది.

రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తొలగించటానికి, రక్తం చిక్కగా లేకుండా పలుచగా ఉండేందుకు సహాయపడుతుంది. అధిక రక్తపోటు ఉన్నవారు నల్ల ఉప్పును ఎక్కువగా తీసుకోకూడదు. జీర్ణ సమస్యలు, గ్యాస్, కడుపు ఉబ్బరం, అజీర్ణం, మలబద్దకం వంటి సమస్యలు లేకుండా చేస్తుంది. అధిక బరువు సమస్యను కూడా తగ్గిస్తుంది. శరీరంలోని విషాలను బయటకు పంపుతుంది.

black salt many wonderful health benefits

సైనస్ సమస్య ఉన్నవారికి చాలా బాగా సహాయపడుతుంది. ఆవిరి పెట్టుకున్నప్పుడు నల్ల ఉప్పును వాడవచ్చు. అలాగే గోరువెచ్చని నీటిలో వేసి పుక్కిలించడం ద్వారా కఫం కరగటమే కాకుండా నాసికా రంధ్రాలు ఫ్రీ అవుతాయి. డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. క‌నుక ఈ ఉప్పును త‌ర‌చూ ఆహారంలో భాగంగా తీసుకుంటే ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు.

Admin

Recent Posts