నేటి కాలంలో దాదాపుగా అందరూ డ్రై ఫ్రూట్స్ తినడానికి ఇష్టపడుతున్నారు. ఇవి ఆరోగ్య పరంగా మంచివి మాత్రమే కాదు వీటిని నిల్వ చేయడం కూడా సులభమే. ముఖ్యంగా ఎండు ద్రాక్ష మనకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. అనేక వ్యాధులను నయం చేసేందుకు ఉపయోగపడుతాయి. ఈ క్రమంలోనే 5 నుంచి 7 కిస్మిస్‌లను ఒక గ్లాస్ పాలలో వేసి మరిగించి రాత్రి పూట ఆ పాలను తాగితే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. కిస్మిస్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. అందువల్ల వాటిని పాలలో వేసి మరిగించి తాగితే మలబద్దకం తగ్గుతుంది. మరుసటి రోజు సుఖ విరేచనం అవుతుంది. అలాగే ఇతర జీర్ణ సమస్యలు తగ్గుతాయి. ముఖ్యంగా గ్యాస్, అసిడిటీ నుంచి ఉపశమనం లభిస్తుంది.
2. కిస్మిస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి చర్మంపై ముడతలు, మచ్చలను తొలగిస్తాయి. చర్మం కాంతివంతంగా మారుతుంది. చర్మ సమస్యలు తగ్గుతాయి.
3. పాలలో కిస్మిస్ లను వేసి మరిగించి తాగడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. కొలెస్ట్రాల్, బీపీలు నియంత్రణలోకి వస్తాయి.
4. కిస్మిస్‌లు, పాలలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. కనుక ఎముకలు దృఢంగా, ఆరోగ్యంగా మారుతాయి. విరిగిన ఎముకలు త్వరగా అతుక్కుంటాయి.
5. నీరసంగా, అలసటగా ఉంటుందని చెప్పేవారు, చిన్న పనికే అలసి పోయే వారు, బద్దకంగా ఉండేవారు ఈ మిశ్రమాన్ని తాగితే ఉత్సాహంగా మారుతారు. శక్తి లభిస్తుంది. చురుగ్గా పనిచేస్తారు.
6. నోటి దుర్వాసన సమస్య ఉన్నవారు ఈ మిశ్రమాన్ని తాగితే ఫలితం ఉంటుంది. అలాగే రక్తహీనత ఉన్నవారికి ఈ మిశ్రమం చక్కగా పనిచేస్తుంది. రక్తం బాగా తయారవుతుంది.
7. పాలలో కిస్మిస్ లను వేసి మరిగించి తాగితే ఆ మిశ్రమంలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కనుక కంటి చూపు పెరుగుతుంది. రేచీకటి, గ్లకోమా, శుక్లాలు వంటి సమస్యలు రాకుండా నిరోధించవచ్చు.
8. ఈ మిశ్రమాన్ని తాగడం వల్ల పురుషుల్లో శృంగార సామర్థ్యం పెరుగుతుంది. వీర్యం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. సంతానం కలిగే అవకాశాలు పెరుగుతాయి.