Brinjal : ఆపరేషన్ చేయించు కోవాల్సినప్పుడు, సర్జరీ చేసే రోజు ఉదయం నుంచి ఎలాంటి ఆహారం తీసుకొవ్వరు వైద్యులు. ఆహారమే కాదు.. కనీసం పచ్చి మంచినీళ్లు కూడా ముట్టనివ్వరు. అంతేకాదు సర్జరీ అయిన తర్వాత కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలని వైద్యులు చెబుతారు. సర్జరీ చేయించుకున్న తర్వాత కచ్చితంగా వంకాయను తినొద్దు అని చెబుతారు వైద్యులు. అయితే ఇలా ఎందుకు చెబుతారో ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా ఏ వైద్యుడు అయినా సర్జరీ చేసే ముందు మత్తు మందును పేషెంట్ కు ఇస్తారు. దీనివల్ల మత్తు కలిగి పేషెంట్ నిద్రపోతాడు. ఆ సమయంలో సర్జరీ చేయడం వలన ఎలాంటి నొప్పి తెలియకుండా ఉంటుంది. అయితే ఇలా మత్తు మందును ఇవ్వడం వల్ల శరీరంలో జీవక్రియలకు ఆటంకం ఏర్పడుతుంది. శరీరం ఒకలాంటి కోమా స్థితిలోకి వెళ్తుంది. దీని వల్ల అన్ని అవయవాలు స్తబ్దుగా అయిపోతాయి.
తిరిగి వెంటనే అవయవాలు పని చేయడానికి సమయం పడుతుంది. ఆ సమయంలో శరీరంలో హిస్టామిన్ లు విడుదల అవుతూ ఉంటాయి. వాటిని తగ్గించడం కోసమే యాంటీ హిస్టామిన్ లు మందులను ఇస్తారు. అయితే వంకాయ హిస్టామిన్ లను విడుదల చేసే పదార్థం. యాంటీ హిస్టామిన్ మందులు వేసుకుంటూ వంకాయ తినడం వలన మందులు పనిచేయవు. అందుకే సర్జరీ సమయంలో వైద్యులు వంకాయ తినకూడదని చెబుతారు. ఇదీ.. దీని వెనుక ఉన్న అసలు కారణం.