Cardamom With Warm Water : యాలకులు.. ఇవి మనందరికి తెలిసినవే. మన వంటింట్లో ఉండే మపాలా దినుసుల్లో ఇవి ఒకటి. యాలకులు చక్కటి వాసనను కలిగి ఉంటాయి. వీటిని ఎక్కువగా మసాలా వంటకాల్లో, తీపి పదార్థాల తయారీలో ఉపయోగిస్తూ ఉంటారు. వంటల రుచిని పెంచడంతో పాటు యాలకులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. యాలకులను సరైన రీతిలో వాడడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. యాలకుల వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. యాలకుల్లో పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్, క్యాల్షియం, ఐరన్ వంటి అనేక పోషకాలు ఉన్నాయి. మలబద్దకం సమస్యను తగ్గించడంలో యాలకులు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి.
రోజూ రాత్రి పడుకునే ముందు రెండు యాలకులను తిని ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిని తాగడం వల్ల మలబద్దకం సమస్య తగ్గుతుంది. రోజూ రెండు యాలకులను తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. రక్తపోటు సమస్య అదుపులో ఉంటుంది. యాలకులను తినడం వల్ల మనం తిన్న ఆహారం చక్కగా జీర్ణమవుతుంది. అలాగే యాలకులను తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య మన దరి చేరకుండా ఉంటుంది. రోజూ రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలల్లో అర టీ స్పూన్ యాలకుల పొడిని, చిటికెడు పసుపును కలిపి తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది. శరీరంలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది.
యాలకులను నమిలి తినడం వల్ల నోటి దుర్వాసన సమస్య తగ్గుతుంది. దంతాలు, చిగుళ్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. యాలకుల నూనెను చర్మానికి రాసుకోవడం వల్ల చర్మం కాంతివంతంగా తయారవుతుంది. చర్మం ఆరోగ్యంగా, కాంతివంతంగా తయారవుతుంది. అదే విధంగా గొంతు నొప్పిని తగ్గించడంలో కూడా యాలకులు మనకు ఉపయోగపడతాయి. నీటిలో యాలకులను వేసి మరిగించాలి. తరువాత ఆ నీటిని గొంతులో పోసుకుని పుక్కిలించడం వల్ల గొంతు నొప్పి తగ్గుతుంది. అదే విధంగా యాలకులను నమిలి తినడం వల్ల శరీరంలో మలినాలు, విష పదార్థాలు తొలగిపోతాయి. శరీర ఆరోగ్యం మెరుగుపడుతుంది.
యాలకులను తీసుకోవడం వల్ల మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తరచూ అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాము. యాలకులను తినడం వల్ల ఎముకలు బలంగా, ధృడంగా తయారవుతాయి. ఈ విధంగా యాలకులు మనకు ఎంతో మేలు చేస్తాయని.. వీటిని తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.