హెల్త్ టిప్స్

Castor Oil : రేచీకటి, కీళ్ల నొప్పులను తగ్గించే దివ్యౌషధం ఆముదం.. ఇంకా మరెన్నో ఉపయోగాలు..!

Castor Oil : ఆముదం నూనె ఎక్కువ‌గా తాగితే విరేచ‌నాలు అవుతాయ‌న్న సంగ‌తి తెలిసిందే. కానీ నిజానికి ఆముదం గురించి చెప్పుకోవాలంటే అది మ‌న‌కు ఎన్నో ర‌కాలుగా ఉప‌యోగ‌ప‌డుతుంది. దాంతో ప‌లు అనారోగ్యాల‌ను న‌యం చేసుకోవ‌చ్చు కూడా. మ‌న దేశంలో ఎన్నో వేల సంవ‌త్స‌రాల కాలం నుంచి ఆముదం వినియోగంలో ఉంది. దాని నూనే కాదు, ఆకులు, విత్త‌నాలు కూడా మ‌న‌కు ఉప‌యోగ‌మే. ఈ క్ర‌మంలో దాని వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఆముదపు ఆకులను నిప్పుల పైన వేడి చేసి దంచి రసం తీసి దానితో సమానంగా అల్లం రసం, నువ్వుల నూనె, అతి మధురం, ఉప్పు కలిపి తైలం మిగిలేవరకు చిన్న మంట మీద మరగబెట్టి వడపోసి.. ఆ నూనె చెవిలో పది చుక్కలు వేస్తే వెంటనే చెవిపోటు తగ్గిపోతుంది.

ఆముదపు గింజలు 225 తీసుకొని పై పెచ్చులు తీసివేసి, లోపలి పప్పులో 12 గ్రాముల శొంఠి పొడి కలిపి మెత్తగా నూరి, కుంకుడు గింజలంత మాత్రలు చేసి నిలువ ఉంచుకొని, పూటకు ఒక మాత్ర చొప్పున రెండు పూటలా మంచి నీళ్ళతో వేసుకొంటూ ఉంటే రెండు లేక మూడు నెలల్లో నల్లమచ్చలన్నీ మాయ‌మ‌వుతాయి. ఆముదం వేళ్ళు, ఉమ్మెత్త వేళ్ళు, వావిలి చెట్టు వేళ్ళు, తెల్ల గలిజేరు వేళ్ళు, మునగ చెట్టు వేళ్ళు, ఆవాలు వీటిని సమానంగా తీసుకొని మంచి నీటితో దంచి రసాలు తీసి, ఆ రసం ఎంత ఉంటే అంత ఆముదం కలిపి, నూనె మాత్రమే మిగిలే వరకు మరగబెట్టి, వడపోసి, ఆ నూనెలో సగభాగం తేనె, మైనం కలిపి ఆయింట్‌మెంట్‌లాగా తయారు చేసుకొని నిలువ ఉంచి, బోదకాలు మీద లేపనం చేస్తూ ఉంటే కాలు యథాస్థితికి వచ్చే అవకాశం ఉంటుంది.

castor oil amazing and wonderful health benefits

ఆముదంలో తాళింపు వేసిన చామదుంపల కూర తింటూ ఉంటే అన్ని ర‌కాల దగ్గులు తగ్గిపోతాయి. మంచి ప్రశస్తమైన ఆముదాన్ని రోజూ రాత్రి పడుకోబోయే ముందు పది గ్రాముల మోతాదుగా నియమబద్ధంగా శారీరక శక్తిని బట్టి సేవిస్తూ ఉంటే మూత్రపిండాలు బాగుంటాయి. మూత్ర బంధం విడిపోతుంది. మూత్ర కోశంలోని రాళ్ళు కరిగిపోతాయి. ఆముదము, కొబ్బరి నూనె సమానంగా కలిపి అరికాళ్ళకు బాగా మర్దనా చేస్తూంటే, అతిత్వరగా అరికాళ్ల‌ మంటలు మాయ‌మ‌వుతాయి. ఆముదము చెట్టు చిగురాకులు, ఉమ్మెత్త చిగురాకులు, జిల్లేడు చిగురాకులు, పొగాకు చిగురాకులు వీటిని భాగాలుగా తీసుకొని మెత్తగా నూరి శనగ గింజలంత మాత్రలు చేసి గాలికి ఆరబెట్టి నిలువ ఉంచుకొని, పూటకొక మాత్ర చొప్పున‌ మంచినీళ్ళతో సేవిస్తూ ఉంటే కీళ్ళ నొప్పులు హరించుకు పోతాయి.

ఎర్ర ఆముదం చెట్టు వేరు 10 గ్రాములు మోతాదుగా తీసుకొని నలగ్గొట్టి పావు లీటర్‌ నీటిలో వేసి సగం నీళ్ళు మిగిలేలా మరగబెట్టి, వడపోసి తాగితే సుఖంగా నిద్ర పడుతుంది. ఆముదపు చెట్టు పూవులను పాలతో నూరి కణతలకు పట్టువేసి, తల పైన కూడా వేసి కట్టుకడితే అతి మగతగా ఉండి ఎక్కువగా నిద్ర వచ్చే సమస్య నివారణ అవుతుంది. మంచి వంటాముదాన్ని ప్రతి రోజూ క్రమం తప్పకుండా తలకు పెడుతూ ఉంటే, రెండు మూడు నెలల్లో రేచీకటి తగ్గి పోతుంది. ఆముదం నూనెను కొంచెం తీసుకుని చ‌ర్మంపై మ‌ర్ద‌నా చేస్తే ఎండ వ‌ల్ల కంది చ‌ర్మం తిరిగి సాధార‌ణ స్థితికి వ‌స్తుంది. మ‌చ్చ‌లు పోతాయి. చ‌ర్మం ప్ర‌కాశవంతంగా మారుతుంది. ఆముదం నూనెను త‌ర‌చూ జుట్టుకు ప‌ట్టించి త‌ల‌స్నానం చేస్తుంటే చుండ్రు త‌గ్గిపోతుంది. వెంట్రుక‌లు దృఢంగా మారుతాయి. జుట్టు ప్రకాశవంతంగా క‌నిపిస్తుంది.

Admin

Recent Posts