Chia Seeds : పోషకాల పవర్ హౌస్ గా పిలవబడే చియా విత్తనాల గురించి మనందరికి తెలిసినవే. ఇవి చాలా చిన్నగా ఉన్నప్పటికి వీటిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని నీటిలో నానబెట్టి తీసుకోవడం, స్మూతీ, జ్యూస్ వంటి వాటితో వీటిని తీసుకుంటూ ఉంటారు. చియా విత్తనాలను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. ముఖ్యంగా శాఖాహారులు వీటిని తీసుకోవడం వల్ల చక్కటి ప్రోటీన్ లభిస్తుంది. కండలు తిరిగే శరీరం కావాలనుకునే శాఖాహారులు చియా విత్తనాలను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. చిన్నగా ఉన్నప్పటికి చియా విత్తనాల్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. కండరాల పెరుగుదలకు, కండరాల మరమ్మత్తుకు ప్రోటీన్ చాలా అసవరం. మొక్క ఆధారిత ప్రోటీన్ ను తీసుకునే వారు చియా విత్తనాలను తప్పకుండా ఆహారంలో భాగంగా చేసుకోవాలి. చియా విత్తనాల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. కండరాల పునరుద్దరణకు ఇవి ఎంతగానో సహాయపడతాయి.
చియా విత్తనాలను తీసుకోవడం వల్ల చక్కటి ఆరోగ్యవంతమైన చర్మం సొంతం అవుతుంది. ఈ విత్తనాల్లో ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. శరీర మొత్తానికి మేలు కలుగుతుంది. ఈ విత్తనాల్లో మన శరీరానికి అవసరమయ్యే 9 రకాల ఆమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇవి కండరాల మరమ్మత్తుకు వాటి అభివృద్దికి సహాయపడతాయి. అలాగే చియా విత్తనాల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి కణాల ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి ఫ్రీ రాడికల్స్ ను నశింపజేయడంలో సహాయపడతాయి. దీంతో మనం దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు తక్కువవుతాయి. చియా విత్తనాల్లో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల ఎముకలు ధృడంగా తయారవుతాయి. కండరాల పనితీరు మెరుగుపడుతుంది. ఈ విత్తనాల్లో ఐరన్ కూడా అధికంగా ఉంటుంది. వీటిని తీసుకోవడ వల్ల అలసట, నీరసం తగ్గుతాయి.
అలాగే చియావిత్తనాలను నానబెట్టి తీసుకోవడం మంచిది. నానబెట్టిన చియా విత్తనాలను తీసుకోవడం వల్ల శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారు, ఆహార నియమాలు కలిగి ఉన్న వారు చియా విత్తనాలను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇవి గ్లూటెన్ రహిత విత్తనాలు. కండరాల నిర్మాణానికి, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇవి ఎంతగానో సహాయపడతాయి. ఈ విధంగా చియా విత్తనాలు మన ఆరోగ్యానికి, చర్మ సౌందర్యానికి ఎంతో మేలు చేస్తాయని వీటిని అందరూ తప్పకుండా తీసుకునే ప్రయత్నం చేయాలని ముఖ్యంగా శాఖాహారులు వీటిని తీసుకోవడం వల్ల మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.