చాలా శాతం మంది ఆహారం విషయంలో వెజిటేరియన్ కంటే నాన్ వెజిటేరియన్ ను ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. ముఖ్యంగా ఆదివారం లేక ఎలాంటి స్పెషల్ అకేషన్ అయినా నాన్ వెజ్ ను ఎక్కువ మంది ఇష్టపడతారు. చికెన్, మటన్, ఎగ్స్, ఫిష్ మరియు సీ ఫుడ్ ఇలా ఎన్నో రకాల నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ లభిస్తాయి. అయితే చాలా శాతం మంది చికెన్ ను ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు.
దీనిలో ఎక్కువ శాతం ప్రోటీన్ ఉంటుంది మరియు ఫిజికల్ డెవలప్మెంట్ కి చాలా సహాయపడుతుంది. కాకపొతే బ్రాయిలర్ చికెన్ కి బదులు కంట్రీ చికెన్ ను తినడమే మేలు. వెయిట్ తగ్గాలనుకునేవారు చికెన్ ని ప్రిఫర్ చేయడం మేలు. ముఖ్యంగా చికెన్ బ్రెస్ట్ లో విటమిన్ బి 3, జింక్, సెలీనియం మరియు ఐరన్ పుష్కలంగా ఉంటాయి.
ఫిష్ లో ప్రోటీన్ తో పాటుగా , ఒమేగా త్రీ ఫ్యాటి యాసిడ్స్ ఉంటాయి. దీంతో గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. కండరాలు, కళ్ళు, బ్రెయిన్ ఆరోగ్యానికి ఇది సహాయపడుతుంది. ఈ రెండిటి లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నా సరే మీ అవసరానికి తగ్గట్టుగా వీటిని తీసుకోండి.