Cholesterol : శరీరంలో అధికంగా కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయన్న సంగతి మనకు తెలిసిందే. అధికంగా ఉండే ఈ కొలెస్ట్రాల్ రక్తనాళాల్లో పేరుకుపోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఉంది. శరీరంలో అధికంగా కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల ఛాతిలో నొప్పి, మెదడు పనితీరు మందగించడం, కాలేయ సంబంధిత సమస్యలు, బీపీ వంటి ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ సమస్య ఎక్కువగా ధూమపానం, మధ్యపానం చేసే వారిలో, వ్యాయామం చేయని వారిలో, జంక్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకునే వారిలో, అలాగే ఒత్తిడికి గురి అయ్యే వారిలో, వివిధ అనారోగ్య సమస్యలకు మందులు వాడే వారిలో, డయాబెటిస్ తో బాధపడే వారిలో కొలెస్ట్రాల్ ఎక్కువగా పేరుకుపోతూ ఉంటుంది.
కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తడంతో పాటు ప్రాణాలకు రకూడా ముప్పు వాటిల్లుతుంది. కనుక మనం ఈ సమస్య నుండి చాలా త్వరగా బయటపడాలి. కొన్ని సహజ సిద్ద ఆహారాలను తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వును మనం చాలా సులభంగా తొలగించుకోవచ్చు. శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను కరిగించే ఆ ఆహారాలు ఏమిటి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను తొలగించడంలో పసుపు మనకు ఎంతో సహాయపడుతుంది. పసుపులో ఉండే ఔషధ గుణాలు కొలెస్ట్రాల్ ను కరిగించడంలో మనకు దోహదపడతాయి. పసుపుతో టీ ని తయారు చేసుకుని తాగడం వల్ల మనం చాలా సులభంగా శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను తొగించుకోవచ్చు. దీని కోసం ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీళ్లు పోసి 10 నిమిషాల పాటు మరిగించాలి. తరువాత ఈ నీటిని గ్లాస్ లోకి తీసుకుని అందులో అర టేబుల్ స్పూన్ పసుపును కలిపి గోరు వెచ్చగా అయ్యే వరకు ఉంచాలి.
తరువాత ఇందులో తేనెను కలిపి మధ్యాహ్నం భోజనం చేసిన అరగంట తరువాత తాగాలి. ఇలా పసుపును తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ ను తొలగించుకోవచ్చు. అదే విధంగా బాదం పప్పును తీసుకోవడం వల్ల కూడా శరీరంలో కొలెస్ట్రాల్ ను తొలగించుకోవచ్చు. బాదంపప్పులో ఫైబర్, మోనో అన్ స్యాచురేటెడ్ ఫ్యాట్స్, పాలీ అన్ సాచ్యురేటెడ్ ఫ్యాట్స్ అధికంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో అధికంగా ఉన్న చెడు కొలెస్ట్రాల్ ను కరిగించడంలో దోహదపడతాయి. రోజూ నానబెట్టిన పది బాదంపప్పులను పొట్టు తీసుకుని ఉదయం పూట తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ ను సులభంగా తొలగించుకోవచ్చు. అదే విధంగా ఆరెంజ్ జ్యూస్ ను తీసుకోవడం వల్ల కూడా మనం చెడు కొలెస్ట్రాల్ ను కరిగించుకోవచ్చు.
ఇందులో ఉండే విటమిన్ సి మన శరీరంలో ఉండే కొలెస్ట్రాల్ ను కరిగించడంలో సహాయపడుతుంది. ప్రతిరోజూ ఒక గ్లాస్ ఆరెంజ్ జ్యూస్ ను తాగడం వల్ల కొలెస్ట్రాల్ సమస్య తగ్గడంతో పాటు గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అలాగే కొలెస్ట్రాల్ ను తొలగించడంలో వెల్లుల్లి రెబ్బలు కూడా మనకు ఎంతో సహాయపడతాయి. కొలెస్ట్రాల్ ను తొలగించడంలో, రక్తనాళాల్లో అడ్డంకులను తొలగించడంలో, రక్తపోటును అదుపులో ఉంచడంలో వెల్లుల్లి మనకు ఎంతో దోహదపడుతుంది. రోజూ ఉదయం పరగడుపున ఒక వెల్లుల్లి రెబ్బను తిని ఆ తరువాత ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిని తాగాలి. ఇలా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ సమస్య తగ్గుతుంది. అలాగే అవిసె గింజలను తీసుకోవడం వల్ల కూడా మనం కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించుకోవచ్చు. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, రక్తనాళాల్లో అడ్డంకులను తొలగించడంలో ఇవి అద్భుతంగా పని చేస్తాయి.
వీటిలో ఉండే ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. ప్రతిరోజూ ఒక టీ స్పూన్ అవిసె గింజలను మధ్యాహ్నం భోజనం చేసిన అరగంట తరువాత రెండు వారాల పాటు తీసుకోవాలి. వీటితో పాటు అల్లాన్ని తీసుకోవడం వల్ల కూడా మనం శరీరంలో ఉండే కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించుకోవచ్చు. అల్లంతో టీని తయారు చేసుకుని తాగడం వల్ల మనం శరీరంలోపేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను సులభంగా తగ్గించుకోవచ్చు. ఈ విధంగా ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను తొలగించుకోవచ్చని అలాగే గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.