Clean Digestive System : మారిన మన జీవనవిధానం, ఆహారపు అలవాట్ల కారణంగా అనారోగ్య సమస్యల బారిన పడే వారి సంఖ్య ఎక్కువవుతుంది. అనే రకాల అనారోగ్య సమస్యలు మనల్ని చుట్టు ముడుతున్నాయి. వీటి వల్ల కొందరు ప్రాణాలు కోల్పోతే మరికొందరు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో జీవితాంతం బాధపడుతున్నారు. ఇటువంటి పరిస్థితులు మనకు రాకుండా ఉండాలంటే మనం కొన్ని ఆరోగ్య సూత్రాలను పాటించాలి. ఈ ఆరోగ్య సూత్రాలను పాటించడం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా మనం ఆరోగ్యంగా జీవించవచ్చు. చక్కటి ఆరోగ్యం కోసం మనం పాటించాల్సిన ఆరోగ్య సూత్రాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రోజూ నాలుగు నుండి ఐదు లీటర్ల నీటిని తాగాలి. నీటిని ఎక్కువగా తాగడం వల్ల శరీరంలో ఉండే మలినాలు, విష పదార్థాలు అన్నీ తొలగిపోతాయి.
అనేక అనారోగ్య సమస్యలకు కారణమయ్యే మలబద్దకం సమస్య తగ్గుతుంది. నీటిని ఎక్కువగా తాగడం వల్ల శరీరం శుభ్రపడుతుంది. అలాగే రోజూ రాత్రి భోజనాన్ని త్వరగా తీసుకోవాలి. సాయంత్రం సమయంలో భోజనాన్ని త్వరగా తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. సాయంత్రం 6 లోపు భోజనాన్ని తీసుకోవడం వల్ల శరీరంలో డిటాక్సిఫికేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతుంది. నిద్ర చక్కగా పడుతుంది. అదే విధంగా రోజులో రెండుసార్లు మాత్రమే ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలి. కూరగాయల జ్యూస్ లు, పండ్ల రసాలు తీసుకోవాలి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మనం తీసుకునే ఆహారంలో 60 శాతం ఉడికించకుండా తీసుకునే ఆహారాలు ఉండేలా చూసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల ఉప్పు, నూనె, కారం, మసాలాలు మన శరీరానికి అందవు. దీంతో మన శరీర ఆరోగ్యం మెరుగుపడుతుంది.
అలాగే మొలకెత్తిన గింజలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్ వంటి వాటిని తీసుకోవాలి. వీలైనంత వరకు సాయంత్రం భోజనంలో ఉడికించిన ఆహారాన్ని తీసుకోవడం మానేయాలి. జంక్ ఫుడ్ కు, నూనెలో వేయించిన పదార్థాలకు, ఉప్పు, పంచదారతో కూడిన పదార్థాలకు, నిల్వ పచ్చళ్లకు దూరంగా ఉండాలి. పండలకు, స్పెషల్ డేస్ లో మాత్రమే జంక్ ఫుడ్ ను తీసుకోవాలి. వీటితో పాటు రోజూ వ్యాయామం, యోగా, ప్రాణాయామం వంటివి చేయాలి. ఈ విధంగా రోజూ ఈ ఆరోగ్య సూత్రాలను పాటించడం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు మన దరి చేరకుండా ఉంటాయని మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.