Frozen Green Peas : పచ్చి బఠానీలు అంటే సహజంగానే చాలా మందికి ఇష్టంగా ఉంటుంది. వీటిని మనం తరచూ వంటల్లో వేస్తుంటాం. పచ్చి బఠానీలను మనం బిర్యానీ రైస్, ఉప్మా తదితర వంటల్లో వేస్తుంటాం. వీటితో నేరుగా కూరలను కూడా చేస్తుంటారు. ఇక కొందరు వీటిని ఉడకబెట్టి లేదా వేయించి తింటారు. అయితే పచ్చి బఠానీలను తినడం వల్ల మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. కానీ వీటిని చాలా మంది సూపర్ మార్కెట్‌లో కొని తెచ్చి వాడుతారు. అక్కడ ఎక్కువగా ఫ్రిజ్‌లో నిల్వ చేయబడి మంచు పేరుకుపోయిన పచ్చి బఠానీలు లభిస్తాయి. వాటినే చాలా మంది తెచ్చి వాడుతారు. అయితే ఇలాంటి పచ్చి బఠానీలను వాడడం ఆరోగ్యానికి హానికరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఫ్రోజెన్ పచ్చి బఠానీలను తినడం వల్ల మనకు ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి పచ్చి బఠానీలను తింటే అధికంగా బరువు పెరిగే అవకాశాలు ఉంటాయి. ఈ బఠానీలను తినడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. దీంతో బరువు పెరుగుతారు. తరువాత ఈ బరువును తగ్గించుకోవడం మీకు కష్టంగా మారుతుంది.
ఇక ఘనీభవించిన పచ్చి బఠానీల్లో పోషకాల శాతం తగ్గుతుంది. అందువల్ల అలాంటి బఠానీలను తింటే మనకు పోషకాలు సరిగ్గా లభించవు. పైగా ఆరోగ్య సమస్యలు వస్తాయి. కనుక తాజా బఠానీలను మాత్రమే తినాల్సి ఉంటుంది. ఇక ఘనీభవించిన బఠానీలను తినడం వల్ల షుగర్, బీపీ ఉన్నవారికి హాని కలుగుతుంది. వారిలో షుగర్ లెవల్స్ లేదా బీపీ లెవల్స్ పెరిగిపోతాయి. దీంతో గుండె సంబంధిత సమస్యలు వస్తాయి. కనుక ఘనీభవించిన పచ్చి బఠానీలను మీరు ఇకపై కొనకండి. వీటిని తింటే అనవసరంగా సమస్యలను కొని తెచ్చుకున్న వారు అవుతారు.