Cooling Fruits : వేసవికాలంలో మనకు ఎక్కువగా లభించే పండ్లల్లో మామిడిపండు కూడా ఒకటి. మామిడిపండ్లు చాలా రుచిగా ఉంటాయి. ఎండలు ఎక్కువైయ్యే కొద్ది మనకు మామిడి పండ్లు ఎక్కువగా లభిస్తూ ఉంటాయి. ఇవి ఎంత ఎక్కువగా పండితే అంత రుచిగా ఉంటాయి. మామిడిపండ్లను చాలా మంది ఇష్టంగా తింటారు. వేసవికాలం వచ్చిందంటే చాలు మామిడి పండ్ల కోసం ఆత్రుతగా ఎదురు చేస్తూ ఉంటారు. మామిడిపండ్లను ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. వేసవికాలంలో మామిడి పండ్లను తినడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. అయితే కొందరిలో మామిడిపండ్లను తినడం వల్ల వివిధ రకాల అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి.
సెగ గడ్డలు, కళ్లు ఎర్రగా మారడం, శరీరంలో వేడి చేసినట్టుగా ఉండడం, మలంలో రక్తం రావడం, మూత్రంలో మంట వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తగానే చాలా మంది మామిడి కాయ తినడం వల్ల శరీరంలో వేడి చేసింది అని అనుకుంటూ ఉంటారు. దీంతో మామిడి పండ్లను తినడమే పూర్తిగా మానేస్తారు. అయితే మామిడిపండ్లను తిన్నప్పటికి మనకు వేడి చేయకుండా ఉండాలంటే మనం నీటిని ఎక్కువగా తాగాలని నిపుణులు చెబుతున్నారు. మామిడి పండ్లల్లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. వేడి చేయడానికి మరో కారణం మనం నీటిని తక్కువగా తీసుకోవడమే అని నిపుణులు చెబుతున్నారు. మామిడి పండ్లను తింటూనే ఆవకాయను కూడా చాలా మంది తింటూ ఉంటారని కానీ మామిడి పండ్లను తినడం వల్లె వేడి చేసిందని భావిస్తారని వారు చెబుతున్నారు. మామిడి పండ్ల కంటే ఆవకాయనే ఎక్కువగా వేడి చేస్తుందనివారు తెలియజేస్తున్నారు.
వేసవికాలంలో 4 నుండి 5 లీటర్ల వరకు నీటిని తాగాలని ఇలా నీటిని తాగుతూ మామిడిపండ్లను తినడం వల్ల అసలు వేడే చేయదని వారు చెబుతున్నారు. ఉదయం పూట లేచిన వెంటనే లీటర్ నుండి లీటర్నర నీటిని తాగాలి. అల్పాహారం చేసిన రెండు గంటల తరువాత నుండి మళ్లీ నీటిని తాగాలి. అలాగే భోజనం చేసేటప్పుడు భోజనం చేసిన రెండం గంటల తరువాత నీటిని తీసుకోకూడదు. మరలా సాయంత్రం నీటిని తీసుకోవాలి.ఇలా రోజుకు 4 నుండి 5 లీటర్ల నీటిని తాగడం వల్ల వేడి చేయకుండా ఉంటుందని వారు చెబుతున్నారు. అదే విధంగా శరీరంలో రోగ నిరోధక శక్తి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ల వల్ల సెగ గడ్డలు వస్తూ ఉంటాయి. మామిడి పండ్లను తినడం వల్లనే సెగ గడ్డలు వచ్చాయని భావిస్తూ ఉంటారు. కానీ మామిడి పండ్లు శరీరంలో రో గనిరోధక శక్తిని పెంచుతాయి.
సెగ గడ్డలు త్వరగా తగ్గేలా సహాయపడతాయి. మామిడి పండును తినడం వల్ల మనకు ఎటువంటి హాని కలగదని ఇవి అన్నీ అపోహలు మాత్రమేనని వారు చెబుతున్నారు. మామిడి పండ్లు మనకు వేసవికాలంలో మాత్రమే లభిస్తాయి. సంవత్సరమంతా ఇవి లభించవు. కనుక ఎటువంటి అపోహలు పెట్టుకోకుండా మామిడి పండ్లను మనస్పూర్తిగా ఆస్వాదిస్తూ ఎన్నైనా తినవచ్చని ఇలా మామిడి పండ్లను తింటూ 4 నుండి 5 లీటర్ల నీటిని తాగడం వల్ల వేడి చేయకుండా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.