Coriander Leaves Tea : కొత్తిమీర.. ఇది మనందరికీ తెలిసిందే. దీనిని మనం వంటల్లో విరివిరిగి ఉపయోగిస్తూ ఉంటాం. కొత్తిమీరను వాడడం వల్ల వంటల రుచితోపాటు వాసన కూడా పెరుగుతుందని చెప్పవచ్చు. ఈ కొత్తిమీరను వంట్లలోనే కాకుండా ఔషధంగా కూడా ఉపయోగించవచ్చు. కొత్తిమీర ఆకుల్లో, గింజల్లో సుగంధ తత్వాలు, ఔషధ గుణాలు అధికంగా ఉన్నాయి. ఫుడ్ పాయిజన్ ను అరికట్టడంలో కొత్తిమీర చక్కగా పని చేస్తుందని తాజాగా జరిపిన ఆధ్యయనాల్లో తేలింది. కొత్తిమీరలో డ్యుడిసినాల్ అనే పదార్థం ఉంటుంది. ఇది ఆహారాన్ని విషతుల్యం చేసే సాల్మనెల్లా బ్యాక్టీరియాను నశింపజేస్తుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
ఫుడ్ పాయిజన్ జరిగినప్పుడు జెన్ టామైసిన్ అనే మందును వాడుతూ ఉంటారు. అయితే దీని కన్నా కొత్తిమీర ప్రభావవంతంగా, సురక్షితంగా పని చేసినట్టు రుజువైంది. కొత్తిమీరను వాడడం వల్ల గ్యాస్ ట్రబుల్ సమస్య నుండి బయటపడవచ్చు. అంతేకాకుండా కొత్తిమీరను ఉపయోగించడం వల్ల మలబద్దకం సమస్య తగ్గుతుంది. శరీరంలో వేడి తగ్గి శరీరం చల్లబడుతుంది. లైంగిక సామర్థ్యం పెరుగుతుంది. శరీరంలో నొప్పులను తగ్గించంతోపాటు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే గుణం కూడా కొత్తిమీరకు ఉందని పరిశోధనల్లో తేలింది.
కొత్తిమీరతో టీని చేసుకుని తాగడం వల్ల మనం దాని వల్ల కలిగే ప్రయోజనాలను పూర్తి స్థాయిలో పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. కొత్తిమీరతో టీ ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. దీని కోసం ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని తీసుకుని వేడి చేయాలి. నీళ్లు వేడయ్యాక అందులో శుభ్రంగా కడిగి తరిగిన కొత్తిమీరను పావు కప్పు మోతాదులో వేయాలి. ఈ నీటిని మరలా 5 నుండి 10 నిమిషాల పాటు బాగా మరిగించాలి. తరువాత ఈ టీ ని వడకట్టి ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి. దీనిని వేడిగానైనా, చల్లగానైనా తాగవచ్చు.
ఈ కొత్తిమీర టీ ని రోజూ ఉదయం పరగడుపున తాగాలి. ఈ టీని తాగడం వల్ల మూత్ర పిండాల్లో రాళ్ల సమస్య నుండి ఉపశమనం కలుగుతుంది. శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ కరిగి బరువు తగ్గుతారు. కొత్తిమీరలో మన శరీరానికి అవసరమయ్యే పోషకాలు ఎన్నో ఉంటాయి. కొత్తిమీర టీ ని తాగడం వల్ల ఆకలి పెరుగుతుంది. ఈ టీ లో కొద్దిగా చక్కెర వేసుకుని తాగడం వల్ల స్త్రీలల్లో నెలసరి సమయంలో వచ్చే అధిక రక్తస్రావం సమస్య నుండి ఉపశమనం కలుగుతుంది. అజీర్తి, వాంతులు వంటి సమస్యలతో బాధపడే వారు కొత్తిమీర టీని తాగడం వల్ల చక్కటి ఫలితాలను పొందవచ్చు. కొత్తిమీర టీని క్రమం తప్పకండా ప్రతిరోజూ తీసుకోవడం వల్ల మనం ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చని దీనిని తరచూ తీసుకోవడం వల్ల అనారోగ్యాల బారిన పడకుండా ఉంటామని నిపుణులు చెబుతున్నారు.