Corn Silk For Kidneys : మనం శరీరంలో ఉండే ముఖ్యమైన అవయవాల్లో మూత్రపిండాలు ఒకటి. ఇవి మన శరీరంలో ఉండే రక్తాన్ని వడపోసి దానిలో ఉండే మలినాలను, విష పదార్థాలను మూత్రం ద్వారా బయటకు పంపిస్తాయి. మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాము. వాటి పనితీరు ఏ మాత్రం దెబ్బతిన్నాకూడా మనం అనేక అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. మూత్రపిండాల్లో మలినాలు, విష పదార్థాలు పేరుకుపోకుండా వాటిని ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా అవసరం. మూత్రపిండాల్లో విష పదార్థాలు పేరుకుపోవడం వల్ల ఆ ప్రభావం మన చర్మం, జుట్టుతో పాటు ఇతర అవయవాల మీద కూడా పడుతుంది.
మూత్రపిండాల్లో విష పదార్థాలు పేరుకుపోవడంతో పాటు వీటికి సంబంధించిన ఇతర అనారోగ్య సమస్యల బారిన పడే వారి సంఖ్య నేటి తరుణంలో ఎక్కువవుతుంది. అస్తవ్యస్థమైన మన ఆహారపు అలవాట్లే మూత్రపిండాలకు సంబంధించిన సమస్యల బారిన పడడానికి ప్రధాన కారణం. జంక్ ఫుడ్, నూనెలో వేయించిన పదార్థాలను ఎక్కువగా తీసుకునే వారిలో, మసాలాలు కలిగిన పదార్థాలను తీసుకునే వారిలో, ప్రాసెస్ట్ ఫుడ్ తీసుకునే వారిలో, చక్కెరలు ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకునే వారిలో మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలాగే ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకునే వారిలో, మద్యపానం చేసే వారిలో, అలాగే ఇతర అనారోగ్య సమస్యలకు మందులను ఎక్కువగా వాడే వారిలో కూడా మూత్రపిండాలు దెబ్బతినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
అలాగే చక్కటి ఆహార నియమాలు, జీవన శైలి ఉన్నప్పటికి మూత్రపిండాల్లో విషపదార్థాలు పేరుకుపోవడం వల్ల వాటికి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక ఆహార నియమాలతో పాటు చక్కటి జీవన శైలిని పాటిస్తూనే మూత్రపిండాల్లో విష పదార్థాలు పేరుకుపోకుండా చూసుకోవాలి. వాటిని తరచుగా డిటాక్సిఫికేషన్ చేస్తూ ఉండాలి. కొన్ని రకాల చిట్కాలను పాటించడం వల్ల మనం మూత్రపిండాల్లో విష పదార్థాలు, మలినాలు పేరుకుపోకుండా చేసుకోవచ్చు. మూత్రపిండాలను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవచ్చు. మూత్రపిండాలను డిటాక్సిఫికేషన్ చేసే చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మూత్రపిండాలను శుభ్రపరచడంలో మనకు కార్న్ సిల్క్ ఎంతగానో ఉపయోగపడుతుంది. మనం సాధారణంగా మొక్కజొన్న కంకిలో ఉండే పీచును పడేస్తూ ఉంటాం.
కానీ దీనితో టీ ని తయారు చేసుకుని తాగడం వల్ల మూత్రపిండాలు శుభ్రపడడంతో పాటు మనం అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా సొంతం చేసుకోవచ్చు. మొక్కజొన్నలో పీచును తీసుకుని ఎండబెట్టాలి. తరువాత ఈ పీచును 50 గ్రాముల మోతాదులో ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో 2 గ్లాసుల నీళ్లు పోసి 10 నుండి 15 నిమిషాల పాటు బాగా మరిగించాలి. తరువాత దీనిని వడకట్టి గోరు వెచ్చగా అయిన తరువాత తాగాలి. ఇలా నెలకు ఒకటి లేదా రెండు సార్లు తీసుకోవడం వల్ల మూత్రపిండాల్లో పేరుకుపోయిన మలినాలు తొలగిపోయి వాటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే మూత్రపిండాలను డిటాక్సిఫికేషన్ చేయడంలో మనకు పుచ్చకాయ గింజలలు కూడా ఎంతగానో ఉపయోగపడతాయి. తాజాగా పుచ్చ గింజలను లేదా మార్కెట్ లో లభించే పుచ్చగింజలతో టీ ని తయారు చేసుకుని తాగడం వల్ల మూత్రపిండాలను శుభ్రపరుచుకోవచ్చు.
ఈ టీ ని తయారు చేసుకోవడానికి గానూ రెండు టేబుల్ స్పూన్ల పుచ్చగింజలను పొడిగా చేసుకోవాలి. తరువాత ఒక గిన్నెలో ఈ పొడిని అలాగే రెండు గ్లాసుల నీళ్లు పోసి కలపాలి. ఈ నీటిని 5 నుండి 6 నిమిషాల పాటు మరిగించాలి. తరువాత ఈ నీటిని బాటిల్ లోకి తీసుకుని నిల్వ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న టీ ని రోజుకు 2 సార్లు తీసుకోవచ్చు. ఈ పుచ్చగింజల టీ ని వారానికి ఒకసారి తీసుకోవడం వల్ల మూత్రపిండాల ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు రక్తహీనత సమస్య కూడా తగ్గుతుంది. ఈ విధంగా ఈ చిట్కాలను పాటిస్తూ చక్కటి ఆహారాన్ని తీసుకుంటూ, మంచి జీవన శైలిని పాటించడం వల్ల మూత్రపిండాలకు సంబంధించిన సమస్యల బారిన పడకుండా ఉంటామని నిపుణులు చెబుతున్నారు.