పడక గదిలో సాహసాలకు పూనుకుంటున్నారా? దానికి ముందు ధాయ్ లాండ్ దేశ వంటకాలు తినండి. ధాయ్ లాండ్ వంటకం…. ‘ధాయ్ గ్రీన్ కర్రీ మనిషిలో కామాగ్నిని రగిలిస్తుందని అంతేకాక రోజంతా ఫిట్ గా వుంచుతూ హాయినిస్తుందని లండన్ లో చేసిన ఒక పరిశోధన తెలుపుతోంది. ఈ మేజిక్ ఆహారంలో కామాన్ని ప్రేరేపించే దినుసులన్నీ సరైన పాళ్ళలో వుంటాయట. వంటకంలోని పదార్ధాలు పరిశీలిస్తే….యాలకులు, జిన్ సెంగ్, వెల్ల్లుల్లి, అల్లం, తులసి, నిమ్మ గడ్డి, తోటకూర లాంటి కొన్ని ఆకు కూరలు మాత్రమే. ఇవన్నీ కలిపి వండి తింటే…ఇక సెక్సీ ఫీలింగులేనట.
ధాయ్ లాండ్ లోని జస్ట్ ఈట్ అనే కంపెనీ పడక గది వంటకాలంటూ తయారు చేసి అమ్మేస్తున్న ఆహారాలలో ఇది బాగా అమ్ముడుపోతోందని తెలుస్తోంది. వీటిలో గ్రీన్ కర్రీ మొదటి స్ధానం కాగా, రెండో స్ధానం అందరికి నోరూరించే హాట్ పిజ్జా కు వచ్చినట్లు రీసెర్చిలో తేలిందని వెబ్ సైట్ జస్ట్ ఈట్ .కో.యుకె. వెల్లడించింది. కొబ్బరి, వెల్లుల్లి, పచ్చిమిరప, అల్లం, బాదం పప్పులు వేసి వండిన చికెన్ కూర్మా మహిళల్లో మహా లైంగిక కోరికలు పుట్టిస్తూ నెం.3 స్ధానంలో వుంది. సీఫుడ్ లక్సా నెం.4 – ఇందులో కొబ్బరి పాలు, అల్లం, గార్లిక్, తులసి, ఉల్లిపాయలు ఉంటాయట.
సెక్స్ కోరికలు పెంచాలంటే ఒకటో స్ధానంలో వున్న గ్రీన్ కర్రీ ఎప్పటినుండో ప్రచారంలో వుందని ది సన్ వార్తా పత్రిక తెలుపుతోంది. లైంగిక కోర్కెలు కలిగిస్తూ, రోజంతా హాయిగా వుండేలా చేసే వంటకాల జాబితాలో ప్రాధాన్యతలనను బట్టి వరుసగా చూడండి….ధాయ్ గ్రీన్ కర్రీ, హాట్ అండ్ స్పైసీ పిజ్జా, చికెన్ కూర్మా, సీఫుడ్ లక్సా, మోలే పోబ్లేనో, సూషి, చికెన్ టిక్కా మసాలా, స్పైసీ బాలినెస్ కర్రీ, స్పైసీ మీట్ బాల్స్ లయద పస్తా, కింగ్ ప్రాన్స్ విత్ జింజర్ అండ్ స్ర్పింగ్ ఆనియన్స్. కనుక శృంగారంలో మీరు కూడా రెచ్చిపోవాలంటే ఈ ఆహారాలను ట్రై చేయండి.