Cumin : మన ఇంట్లో ఉండే పదార్థాలతో చక్కటి పానీయాన్ని తయారు చేసి తీసుకోవడం వల్ల మనం చాలా సులభంగా అధిక బరువు సమస్య నుండి బయటపడవచ్చు. నేటి తరుణంలో మనలో చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. మారిన మన జీవన విధానం, ఆహారపు అలవాట్లే ఈ సమస్య బారిన పడడానికి ప్రధాన కారణం. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ సమస్య బారిన పడుతున్నారు. జంక్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవడం, వ్యాయామం చేయకపోవడం, నూనెలో వేయించిన పదార్థాలను తీసుకోవడం, కూర్చుని పని చేయడం వంటి వివిధ కారణాల చేత మనలో చాలా మంది ఈ సమస్య బారిన పడుతున్నారు. అధిక బరువు సమస్యను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు.
లేదంటే మనం అనేక ఇతర అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. కనుక ఈ సమస్య నుండి వీలైనంత త్వరగా బయటపడాలి. బరువు తగ్గాలనుకునే వారు రోజూ చేసే పనులతో పాటు ఇప్పుడు చెప్పే పానీయాన్ని కూడా తయారు చేసుకుని తాగడం వల్ల చాలా సులభంగా బరువు తగ్గవచ్చు. బరువు తగ్గించే ఈ పానీయాన్ని ఎలా తయారు చేసుకోవాలి… అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పానీయాన్ని తయారు చేసుకోవడానికి గానూ మనం జీలకర్రను, అల్లాన్ని, నిమ్మరసాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా జార్ లో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి. తరువాత ఈ పొడిని ఒక గిన్నెలో వేసుకుని అందులో ఒక ఇంచు అల్లం తురుము, లీటర్ నీటిని పోసి వేడి చేయాలి.
నీళ్లు మరిగిన తరువాత మరో 5 నిమిషాల పాటు మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఈ పానీయాన్ని వడకట్టి అందులో ఒక నిమ్మకాయ నుండి తీసిన మొత్తం నిమ్మరసాన్ని వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల బరువు తగ్గించే పానీయం తయారవుతుంది. ఈ పానీయాన్ని ఆహారం తీసుకోవడానికి అర గంట ముందు 50 ఎమ్ ఎల్ మోతాదులో తీసుకోవాలి. ఇలా మూడు పూటలా తీసుకోవడం వల్ల మనం చాలా సులభంగా బరువు తగ్గవచ్చు. దీనిని తీసుకోవడం వల్ల శరీరంలో ఎక్కువగా ఉండే కొలెస్ట్రాల్ తొలగిపోతుంది. శరీరంలో ఎక్కువగా ఉండే నీరు బయటకు పోతుంది. శరీరంలో మెటబాలిజం రేటు పెరుగుతుంది. అంతేకాకుండా చక్కటి ఆరోగ్యం కూడా మన సొంతమవుతుంది. బరువు తగ్గాలనుకునే వారు ఇలా జీలకర్రతో చక్కటి పానీయాన్ని తయారు చేసుకుని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.