Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వార్త‌లు

Curry Leaves For Eyes : క‌రివేపాకుతో ఇలా చేయండి చాలు.. కంటి చూపు అమాంతం పెరుగుతుంది..!

D by D
November 30, 2023
in వార్త‌లు, హెల్త్ టిప్స్
Share on FacebookShare on Twitter

Curry Leaves For Eyes : నేటి త‌రుణంలో మ‌న‌లో చాలా మంది కంటి సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. ముఖ్యంగా చాలా మంది కంటిచూపుకు సంబంధించిన స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. కంటి చూపు త‌గ్గ‌డం వ‌ల్ల చిన్న వ‌య‌సు నుండే క‌ళ్ల‌ద్దాలు వాడాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది. కంటి చూపు త‌గ్గ‌డానికి వివిధ కార‌ణాలు ఉంటాయి. కంప్యూట‌ర్ ల‌ను, సెల్ ఫోన్ ల‌ను ఎక్కువ‌గా చూడ‌డం వల్ల కంటి చూపు త‌గ్గుతుంది. అలాగే నిద్ర‌లేమి కార‌ణంగా కూడా కంటి చూపు త‌గ్గుతుంది. త‌క్కువ‌గా నిద్ర‌పోవ‌డం వ‌ల్ల కంటిచూపు తీవ్రంగా దెబ్బ‌తింటుంది. అలాగే పోష‌కాహార లోపం వ‌ల్ల కూడా కంటిచూపు దెబ్బ‌తింటుంది. ఇలా అనేక ర‌కాల కార‌ణాల చేత కంటి చూపు దెబ్బ‌తింటుంది.

ఇలా కంటి చూపుకు సంబంధించిన స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు స‌హ‌జ సిద్ద ఆహారాల‌ను తీసుకోవ‌డం ద్వారా కూడా కంటిచూపును మెరుగుప‌రుచుకోవ‌చ్చు. కంటిచూపును, కంటి ఆరోగ్యాన్ని పెంచ‌డంలో మ‌న‌కు విట‌మిన్ ఎ ఎంతో దోహ‌ద‌ప‌డుతుంది. మాంసాహారంలో విట‌మిన్ ఎ నేరుగా అదే రూపంలో ఉంటుంది. కానీ శాఖాహారాల్లో విట‌మిన్ ఎ కెరోటీన్ రూపంలో ఉంటుంది. దీనిని మ‌న శ‌రీరంలో ఉండేకాలేయం విట‌మిన్ ఎ రూపంలోకి మార్చుతుంది. విటమిన్ ఎ ఎక్కువ‌గా ఉండే ఆహారాల్లో క్యారెట్ కూడా ఒక‌టి. క‌నుక కంటి చూపుకు సంబంధించిన స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు రోజుకు రెండు సార్లు క్యారెట్ జ్యూస్ ను తీసుకునే ప్ర‌య‌త్నం చేయాలి. క్యారెట్ జ్యూస్ ను నేరుగా తాగ‌లేని వారు జ్యాస్ ప‌ట్టేట‌ప్పుడు జార్ లో క్యారెట్ ముక్క‌లు, కీర దోస ముక్క‌లు, ట‌మాట ముక్క‌లు, బీట్ రూట్ వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టి తీసుకోవాలి. ఈ జ్యూస్ ను వ‌డ‌క‌ట్టి అందులో తేనె వేసి తీసుకోవాలి.

Curry Leaves For Eyes take them in this way for better health
Curry Leaves For Eyes

ఇలా రోజుకు రెండు సార్లు క్యారెట్ జ్యూస్ ను తీసుకోవ‌డం వ‌ల్ల కంటి చూపు మెరుగుప‌డుతుంది. అలాగే ఇదే జ్యూస్ లో లేత క‌రివేపాకును మెత్త‌ని పేస్ట్ లాగా చేసి క‌లిపి తీసుకోవ‌చ్చు. ఇలా క‌రివేపాకును తీసుకోవ‌డం వ‌ల్ల కూడా కంటి చూపు మెరుగుప‌డుతుంది. అలాగే ఇందులో క‌రివేపాకుకు బ‌దులుగా మున‌గాకు పేస్ట్ ను కూడా క‌లిపి తీసుకోవ‌చ్చు. క‌రివేపాకు మ‌రియు మున‌గాకులో కూడా విటమిన్ ఎ ఎక్కువ‌గా ఉంటుంది. ఇలా జ్యూస్ ను త‌యారు చేసి తీసుకోవ‌డం వ‌ల్ల కంటిచూపు ఎంత‌గానో మెరుగుప‌డుతుంది.

క‌ళ్ల‌ద్దాలు వాడే అవ‌స‌రం కూడా త‌గ్గుతుంది. అలాగే కంటిచూపుకు సంబంధించిన స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు మ‌ధ్యాహ్నం భోజ‌నంలో ఏదో ఒక ఆకుకూర ఉండేలా చూసుకోవాలి. ఇలా త‌యారు చేసుకున్న జ్యూస్ లో అలాగే రోజూ త‌గినంత నిద్ర పోవ‌డం కూడా చాలా అవ‌స‌రం. నిద్ర‌పోవ‌డం వ‌ల్ల కంటిచూపుకు సంబంధించిన స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. ఈ విధంగా ఈ చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల మ‌నం చాలా సుల‌భంగా కంటి చూపును మెరుగుప‌రుచుకోవ‌చ్చ‌ని కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

Tags: Curry Leaves For Eyes
Previous Post

Ravva Burelu : ర‌వ్వ బూరెల‌ను ఒక్క‌సారి ఇలా చేయండి.. రుచి చూస్తే మ‌ళ్లీ ఇలాగే చేసుకుంటారు..!

Next Post

Ginger Candy : రోజూ ఇదొక‌టి తినండి చాలు.. ద‌గ్గు, జ‌లుబు ఉండ‌వు.. ఎలా చేయాలంటే..?

Related Posts

ఆధ్యాత్మికం

మ‌న‌కి మంచి రోజులు వ‌చ్చాయ‌ని ఎలా తెలుస్తుంది..?

July 5, 2025
ఆధ్యాత్మికం

ఈ రాశుల‌కు చెందిన వారు ఎట్టి ప‌రిస్థితిలోనూ తాబేలు ఉంగ‌రాన్ని ధ‌రించ‌కూడ‌దు..!

July 5, 2025
ఆధ్యాత్మికం

శివుడికి మీరు వీటితో అభిషేకం చేస్తే.. ఏం కోరుకున్నా నెర‌వేరుతుంది..!

July 5, 2025
lifestyle

ఒంటరిగా ఉన్నప్పుడు నా భార్య ఫోర్స్ చేస్తోంది.. అలా ఉందామంటూ..!!

July 5, 2025
వినోదం

సర్కారు వారి పాటలో ఈ మిస్టేక్ ను గమనించారా? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు అబ్బా!

July 5, 2025
వినోదం

శ్రీమంతుడు నుంచి బలగం కథలు దొంగలించారంటూ..! వివాదాస్పదంగా నిలిచిన 10 సినిమాలు ఇవేనా ?

July 5, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.