హెల్త్ టిప్స్

రోజూ ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్‌ను త‌ప్ప‌క తాగాలి.. అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు..!

మనం ఆహారంలో భాగంగా తీసుకునే వాటిల్లో క్యారెట్ కూడా ఒక‌టి. ఇది మ‌నందరికీ సుప‌రిచిత‌మే. మ‌నం వంట‌ల్లో త‌రుచూ క్యారెట్ ను వాడుతూ ఉంటాం. అలాగే కొంద‌రూ దీనిని నేరుగా కూడా తింటూ ఉంటారు. కేవ‌లం వంట‌ల్లోనే కాకుండా క్యారెట్ ను జ్యూస్ గా కూడా చేసుకుని తాగ‌వ‌చ్చు. రోజూ క్యారెట్ జ్యూస్ ను తాగ‌డం వ‌ల్ల మ‌నం అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. క్యారెట్ జ్యూస్ ను ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

క్యారెట్ ల‌లో బీటా కెరోటిన్ ఎక్కువ‌గా ఉంటుంది. ఇది శ‌రీరంలోకి వెళ్లిన త‌రువాత విట‌మిన్ ఎ గా మారుతుంది. క్యారెట్ జ్యూస్ ను తాగ‌డం వ‌ల్ల మ‌న‌కు త‌గినంత విట‌మిన్ ఎ ల‌భించి క‌ళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. అంతేకాకుండా క్యారెట్ లో కెరోటినాయిడ్లు అధికంగా ఉంటాయి. క్యారెట్ జ్యూస్ ను తాగ‌డం వ‌ల్ల వీటిలో ఉండే కెరోటినాయిడ్లు యాంటీ ఆక్సిడెంట్లుగా ప‌నిచేసి శ‌రీరంలోని మ‌లినాల‌ను బ‌య‌ట‌కు పంపించ‌డంతోపాటు శ‌రీరానికి హాని చేసే ఫ్రీ రాడిక‌ల్స్‌తో పోరాడి అవి న‌శించేలా చేస్తాయి. క్యారెట్ జ్యూస్ ను తాగ‌డం వ‌ల్ల ఒత్తిడి త‌గ్గి మాన‌సిక ప్ర‌శాంత‌త ల‌భిస్తుంది. శ‌రీరంలో జీవ‌క్రియ‌లు సాఫీగా సాగుతాయి.

daily one glass carrot juice drinking benefits

క్యారెట్ జ్యూస్ ను రోజూ తాగ‌డం వ‌ల్ల క్యాన్స‌ర్ వ‌చ్చే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉంటాయ‌ని నిపుణులు చెబుతున్నారు. చ‌ర్మం పై ముడ‌త‌లు త‌గ్గి, ముఖం కాంతివంతంగా త‌యార‌య్యేలా చేయడంలో కూడా క్యారెట్ జ్యూస్ మ‌న‌కు స‌హాయ‌ప‌డుతుంది. అజీర్తి, మ‌ల‌బ‌ద్ద‌కం వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వారు రోజూ క్యారెట్ జ్యూస్ ను తాగ‌డం వ‌ల్ల జీర్ణ‌క్రియ మెరుగుప‌డి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు రోజూ ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్ ను తాగ‌డం వ‌ల్ల త్వ‌ర‌గా బ‌రువు త‌గ్గుతారు. అధిక ర‌క్త‌పోటు, థైరాయిడ్ వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు క్యారెట్ జ్యూస్ ను తాగ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుందని, క్యారెట్ జ్యూస్ ను త‌ప్ప‌కుండా ఆహారంలో భాగంగా చేసుకోవాల‌ని.. నిపుణులు తెలియ‌జేస్తున్నారు.

Share
Admin

Recent Posts