ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అధిక శాతం మంది డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నారు. డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవాల్సి వస్తే ముఖ్యంగా ఆరోగ్యకరమైన జీవనవిధానాన్ని కలిగి ఉండాలి. ప్రధానంగా బరువు తగ్గడంపై, పోషకాహారం తీసుకోవడంపై దృష్టి సారించాలి. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించుకోగలుగుతారు. ఈ క్రమంలోనే రోజూ తినాల్సిన ఆహారాల్లోనూ పలు మార్పులు చేసుకోవాలి. ఆహారం విషయానికి వస్తే డయాబెటిస్ ఉన్నవారు ముఖ్యంగా కింద తెలిపిన పండ్లను రోజూ తినడం వల్ల షుగర్ లెవల్స్‌ను తగ్గించుకోవచ్చు. మరి ఆ పండ్లు ఏమిటంటే…
1. నారింజ పండ్లు తియ్యగా ఉంటాయి. అయినప్పటికీ అవి సిట్రస్ జాతికి చెందినవి కనుక వాటి గ్లైసీమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. దీంతో వాటిని తిన్న వెంటనే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు. పైగా నారింజ పండ్లలో ఉండే ఫైబర్, నారింగెనిన్ వంటి వృక్ష సంబంధ సమ్మేళనాలు యాంటీ డయాబెటిక్ గుణాలను కలిగి ఉంటాయి. దీంతో నారింజ పండ్లను తింటే షుగర్ లెవల్స్ తగ్గుతాయి.
2. యాపిల్ పండ్లలో సాల్యుబుల్ ఫైబర్, వృక్ష సంబంధ సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. క్వర్సెటిన్, క్లోరోజెనిక్ యాసిడ్ వంటి సమ్మేళనాలు యాపిల్ పండ్లలో ఉంటాయి. ఇవి షుగర్ లెవల్స్‌ను నియంత్రిస్తాయి. డయాబెటిస్‌కు వ్యతిరేకంగా పోరాడుతాయి. అందువల్ల యాపిల్ పండ్లను రోజూ తింటే డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవచ్చు.
3. బొప్పాయి పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి బ్లడ్ షుగర్ లెవల్స్ ను నియంత్రిస్తాయి. డయాబెటిస్ ఉన్నవారికి సహజంగానే గుండె సమస్యలు వస్తాయి. అలా రాకుండా ఉండాలంటే బొప్పాయి పండ్లను తరచూ తీసుకోవాలి. ఈ పండ్లను తినడం వల్ల మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో కణాలు దెబ్బ తినకుండా ఉంటాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
4. డయాబెటిస్ ఉన్నవారు దానిమ్మ పండ్లను కూడా తరచూ తినాలి. వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్‌ను నాశనం చేసి తీవ్రమైన అనారోగ్య సమస్యలు రాకుండా చూస్తాయి. దీంతో షుగర్ అదుపులో ఉంటుంది.
5. ద్రాక్ష పండ్లలో రెస్వెరెట్రాల్ అనబడే ఫైటోకెమికల్ ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. శరీరం ఇన్సులిన్‌ను ఉపయోగించుకునేలా ప్రోత్సహిస్తుంది. దీంతో డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది.
6. డయాబెటిస్ ఉన్నవారికి జామ పండ్లు వరమనే చెప్పవచ్చు. వీటి గ్లైసీమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. అలాగే వీటిల్లో ఉండే ఫైబర్ డయాబెటిస్‌ను తగ్గిస్తుంది. జామ పండ్లను తరచూ తింటుంటే షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి.
7. నేరేడు పండ్లు కేవలం సీజన్‌లోనే లభిస్తాయి. అందువల్ల వాటిని డయాబెటిస్ ఉన్నవారు సీజన్‌లో కచ్చితంగా తినాలి. వాటిల్లో ఉండే ఔషధ గుణాలు షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తాయి. డయాబెటిస్ అదుపులో ఉంటుంది.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365