Fatty Liver : మన శరీరంలోని అనేక అవయవాల్లో లివర్ కూడా ఒకటి. ఇతర అవయవాలకు ఇచ్చినంత ప్రాధాన్యతను చాలా మంది లివర్‌కు ఇవ్వరు. అందువల్ల చాలా మందికి లివర్ సమస్యలు వస్తుంటాయి. లివర్‌లో సాధారణంగా ఎంతో కొంత కొవ్వు ఉంటుంది. కానీ అది మోతాదుకు మించితే ఫ్యాటీ లివర్ సమస్య వస్తుంది. దీంతో ఆరోగ్యంపై ఎంతో ప్రభావం పడుతుంది. ఫ్యాటీ లివర్ సమస్య ఉంటే డాక్టర్లు దానిని వైద్య పరీక్షల ద్వారా నిర్దారించి కోలుకునేందుకు మందులను రాస్తారు. ఈ క్రమంలో ఆ మందులను క్రమం తప్పకుండా వాడాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు చెప్పబోయే కొన్ని రకాల ఆహారాలను తరచూ తీసుకోవడం వల్ల లివర్ లో పేరుకుపోయిన కొవ్వును కరిగించవచ్చు. దీంతో ఫ్యాటీ లివర్ సమస్య నుంచి సులభంగా బయట పడతారు. ఇక ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
చాలా మంది ఉదయాన్నే బ్లాక్ కాఫీ తాగుతుంటారు. అయితే ఇది లివర్‌కు ఎంతో మేలు చేస్తుందని చెప్పవచ్చు. బ్లాక్ కాఫీలో అనేక యాంటీ ఆక్సిడెంట్లు, పాలిఫినాల్స్ ఉంటాయి. ఇవి అసాధారణ స్థాయిలో ఉండే లివర్ ఎంజైమ్‌లను తగ్గించేస్తాయి. దీంతో లివర్ పనితీరు మెరుగు పడుతుంది. అలాగే బ్లాక్ కాఫీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. దీంతో లివర్ డ్యామేజ్ అవకుండా ఉంటుంది. కనుక రోజూ ఒక కప్పు బ్లాక్ కాఫీని సేవించడం వల్ల ఫ్యాటీ లివర్ సమస్య నుంచి సులభంగా బయట పడవచ్చు.
ఆకుకూరలను తినాలి..
పాలకూర, ఇతర ఆకుపచ్చని కూరగాయలు, ఆకుకూరలు లివర్‌కు ఎంతో మేలు చేస్తాయని చెప్పవచ్చు. వీటిల్లో లివర్ ఆరోగ్యానికి ఉపయోగపడే అనేక పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా వీటిలో నైట్రేట్లు, పాలిఫినాల్స్ సమృద్ధిగా ఉంటాయి. అలాగే ఆకుకూరల్లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు ఎ, సి, కె కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇవన్నీ కణాలు డ్యామేజ్ అవకుండా చూస్తాయి. దీంతో లివర్‌లో ఉండే కొవ్వు కరుగుతుంది. లివర్ పనితీరు మెరుగు పడుతుంది. ఫలితంగా ఫ్యాటీ లివర్ సమస్య తగ్గుతుంది. కాబట్టి ఆకుకూరలు, ఆకుపచ్చని కూరగాయలను తరచూ తింటుండాలి.
అవకాడోలు సాధారణంగానే కాస్త ఖరీదు కలిగి ఉంటాయి. కానీ లివర్ ఆరోగ్యానికి ఇవి చేసే మేలు అంతా ఇంతా కాదు. అవకాడోల్లో గ్లూటాథియోన్ ఉంటుంది. ఇది లివర్‌లోని వ్యర్థాలను బయటకు పంపి లివర్ పనితీరును మెరుగు పరుస్తుంది. దీంతో ఫ్యాటీ లివర్ సమస్య తగ్గుతుంది. అలాగే అవకాడోల్లో ఉండే విటమిన్లు ఇ, సి లివర్ కణాలను సురక్షితంగా ఉంచుతాయి. దీంతో లివర్ ఆరోగ్యం మెరుగు పడుతుంది. కనుక అవకాడోలను కూడా ఆహారంలో భాగం చేసుకోవాలి.
పసుపుతో లివర్ సురక్షితం..
భారతీయులందరి ఇళ్లలోనూ పసుపు ప్రధాన వంట ఇంటి సామగ్రిగా ఉంటుంది. పసుపును నిత్యం మనం కూరల్లో వేస్తుంటాం. అయితే ఇది లివర్ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. పసుపులో ఉండే కర్‌క్యుమిన్ అనే సమ్మేళనం లివర్‌లో ఉండే కొవ్వును కరిగిస్తుంది. దీని వల్ల ఫ్యాటీ లివర్ నుంచి విముక్తి పొందవచ్చు. అలాగే వాట్ నట్స్‌ను ఆహారంలో భాగం చేసుకున్నా కూడా ఫ్యాటీ లివర్ సమస్య తగ్గుతుంది. వాల్‌నట్స్‌ను రోజూ గుప్పెడు మోతాదులో నీటిలో నానబెట్టాలి. రాత్రి పూట ఇలా చేయాలి. మరుసటి రోజు ఉదయం వాటిని తినాలి. ఈ విధంగా కొద్ది రోజుల పాటు వాల్ నట్స్‌ను తింటే మీ లివర్ ఎప్పటిలా ఆరోగ్యంగా పనిచేస్తుంది. అందులో ఉండే కొవ్వు కరిగిపోతుంది. ఈ విధంగా ఈ ఆహారాలను తింటుండడం వల్ల మీ లివర్‌కు ఎంతగానో మేలు జరుగుతుంది.