Cold And Cough : జలుబు వచ్చిందంటే చాలు.. ఓ పట్టనా వదలకుండా వేదిస్తూ ఉంటుంది. ఈ జలుబుకు తోడు తలనొప్పి, దగ్గు, తుమ్ములు ఒకదాని తర్వాత మరొకటి ఇలా అనేక సమస్యలు వస్తూనే ఉంటాయి. ఈ సమస్యల వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితి బట్టి ప్రతి ఒక్కరిలోనూ రోగనిరోదక శక్తిని పెంచుకోవటం చాలా ముఖ్యం. అదేవిధంగా ఈ చలికాలంలో దగ్గు,జలుబు, గొంతు నొప్పి వంటివి చాలా తొందరగా వ్యాపిస్తూ ఉంటాయి. వీటిని అశ్రద్ద చేస్తే ఊపిరితిత్తులలో కఫము పెరుకొని అనేక రకాల అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది.
జలుబు, దగ్గు, కఫం తగ్గించడంలో ఇంటి చిట్కాలు బాగా సహాయపడతాయి. దీని కోసం ఇంటిలో సులభంగా ఉండే వస్తువులతో వ్యాధి నిరోధక శక్తిని పెంచడంతో పాటు జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి సమస్యలను తగ్గించుకోవచ్చు. ఈ చిట్కా కోసం తమలపాకు, అల్లం, తేనె మంచి ఔషధంగా పనిచేస్తాయి. ఒక తమలపాకును శుభ్రంగా నీటితో కడిగి రసం తీయాలి. అదేవిధంగా అల్లంను కూడా తురిమి రసం తీసుకోవాలి. ఒక బౌల్ లో ఒక టీ స్పూన్ అల్లం రసం, ఒక టీ స్పూన్ తమలపాకు రసం, ఒక టీ స్పూన్ తేనె వేసి బాగా కలపాలి.
ఈ మిశ్రమాన్ని ఉదయం ఒక టీ స్పూన్, సాయంత్రం ఒక టీ స్పూన్ తీసుకోవాలి. చిన్న పిల్లలకు అయితే అరస్పూన్ తీసుకుంటే సరిపోతుంది. ఇలా మూడు రోజుల పాటు తీసుకుంటే జలుబు, దగ్గు నుంచి మంచి ఉపశమనం కలుగుతుంది. తమలపాకులో ఉన్న లక్షణాలు శ్వాసకోశ సమస్యలను, దగ్గు, ఆస్తమా, గొంతులో కఫాన్ని తగ్గించటంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. సమస్య చిన్నగా ఉన్నప్పుడూ మాత్రం ఈ చిట్కా ఫాలో అవ్వటం ఉత్తమం. సమస్య కనుక ఎక్కువగా ఉంటే డాక్టర్ సలహా తీసుకోవటం మంచిది.