Drinking Water : ఆహార పదార్థాలను తీసుకున్న తర్వాత వెంటనే నీళ్లు తాగుతూ ఉంటాము. కానీ అలా చేయడం తప్పు. కొన్ని ఆహార పదార్థాలను తిన్నాక వెంటనే నీళ్లు తాగడం వలన ఆరోగ్యం పాడవుతుంది. అనేక రకాల అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంటుంది. నిజానికి మనం ఏ ఆహార పదార్థాలను తీసుకున్నా వెంటనే నీళ్లు తాగకూడదు. కొంచెం గ్యాప్ ఇచ్చి మాత్రమే నీళ్లు తాగాలి. ముఖ్యంగా ఈ ఆహార పదార్థాలను తిన్నాక అసలు నీళ్లు తాగకూడదు.
పండ్లు తిన్న వెంటనే నీళ్లు తాగకూడదు. ఈ విషయాన్ని పెద్దలు కూడా చెప్తూ ఉంటారు. పండ్లలో చక్కెర, ఈస్ట్ ఎక్కువ ఉంటాయి. వెంటనే నీళ్లు తాగడం వలన జీర్ణం అవ్వదు. ఈ పండ్లని జీర్ణం చేయడానికి మన కడుపులో హైడ్రోక్లోరిక్ యాసిడ్ రిలీజ్ అవుతుంది. ఇలాంటప్పుడు నీళ్లు తాగితే ఆ యాసిడ్ కరిగి పండు సరిగ్గా జీర్ణం అవ్వదు. అసౌకర్యంగా ఉంటుంది.
పుచ్చకాయ, దోసకాయ, నారింజ పండ్లలో నీళ్లు ఎక్కువగా ఉంటాయి. వీటిని సరిగ్గా తింటే జీర్ణవ్యవస్థకి చాలా మేలు కలుగుతుంది. కానీ ఇవి తిన్న తర్వాత నీళ్లు తాగితే డయేరియా వస్తుంది. నీళ్లు సరిగ్గా జీర్ణం అవ్వకుండా, వేగంగా ఆహారం జీర్ణం అయ్యేలా చేస్తుంది. ఏ ఆహారం తిన్న తర్వాత కూడా నీళ్లు తాగకండి. కనీసం అరగంట పాటు గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత నీళ్లు తాగడం మంచిది.
ఒకవేళ కనుక నీళ్లు తాగాలని అనుకుంటే వేడినీళ్లని కొంచెం తాగండి. ఐస్ క్రీమ్ ని కూడా చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. ఐస్ క్రీమ్ తిన్న తర్వాత కూడా అసలు నీళ్లు తాగకండి. వేరుశనగ, నువ్వులు తిన్న తర్వాత కూడా నీళ్లు తాగకూడదు. అదేవిధంగా చెరుకు తిన్న వెంటనే కూడా నీళ్లు తాగకండి. చెరుకులో క్యాల్షియం, పొటాషియం ఎక్కువ ఉంటాయి. వెంటనే నీళ్లు తాగడం వలన సమస్య వస్తుంది.