హెల్త్ టిప్స్

Liver : మీరు ఈ త‌ప్పులు చేస్తున్నారా.. అయితే లివ‌ర్ డ్యామేజ్ అవ‌డం ఖాయం..!

Liver : చాలామంది రకరకాల సమస్యలతో బాధపడుతున్నారు. ఈ రోజుల్లో చాలామంది కిడ్నీ సమస్యలు, లివర్ సమస్యలు వంటి వాటితో బాధపడుతున్నారు. అయితే లివర్ ఆరోగ్యాన్ని కొన్ని దెబ్బతీస్తూ ఉంటాయి. మరి వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడం చాలా ముఖ్యం. కాలేయం జీవక్రియ, జీర్ణక్రియ, పోషకాలను నిల్వ చేయడం వంటి పనులను చేస్తుంది. కనుక కచ్చితంగా కాలేయ ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. అయితే మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల కాలేయ ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇప్పుడు మరి ఎటువంటి వాటి వలన కాలేయం దెబ్బతింటుంది అనేది తెలుసుకుందాం.

ధూమపానం ఆరోగ్యానికి మంచిది కాదని అందరికీ తెలుసు. కానీ ఇంకా చాలామంది స్మోకింగ్ చేస్తున్నారు. అయితే స్మోకింగ్ వలన లివర్ దెబ్బ తినే అవకాశం ఉంటుంది. కాలేయ క్యాన్సర్, హెపటైటిస్ వంటి ప్రమాదకరమైన సమస్యల్ని తీసుకువస్తుంది. కాబట్టి ధూమపానాన్ని మానేయండి. అలాగే ప్యాక్ చేసిన ఆహార పదార్థాల‌ను ఎక్కువగా తీసుకోవడం వలన అనేక సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ట్రాన్స్ ఫ్యాట్స్ వలన కాలేయం దెబ్బతింటుంది.

do not make these mistakes or else your liver will be damaged

అధిక ట్రాన్స్ ఫ్యాట్స్ ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవడం వలన నాలుగు నెలల్లోనే కాలేయ వ్యాధి సంభవిస్తుంది. యాంటీ డిప్రెసెంట్ మందులు వలన కూడా కాలేయం బాగా దెబ్బ తినే అవకాశం ఉంటుంది. చక్కెరని ఎక్కువగా తీసుకోవడం వలన కూడా కాలేయంపై ప్రభావం పడుతుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం కాలేయం వల్ల కలిగే నష్టం మద్యం వల్ల కలిగే నష్టం కంటే ఎక్కువ.

కాబట్టి షుగర్ ఎక్కువ తీసుకోవద్దు. చాలామంది హెర్బల్ సప్లిమెంట్స్ సహజమైనవి కనుక మేలు చేస్తాయి అని అనుకుంటుంటారు. కానీ హెర్బల్ సప్లిమెంట్స్ కూడా లివర్ పై ప్రభావం చూపిస్తాయి. ఎప్పుడైనా ఏదైనా మూలికలని తీసుకునే ముందు కూడా వైద్యుడిని సంప్రదించండి. అలాగే కృత్రిమ పానీయాలు వంటివి కూడా తీసుకోవద్దు. ఉబకాయం వలన కూడా కాలేయం దెబ్బతింటుంది. అధిక స్థాయిలో విటమిన్ ఎ వలన కాలేయం దెబ్బ తిన‌వ‌చ్చు. కాబట్టి ఈ పొరపాట్లు జరగకుండా చూసుకోవడం మంచిది.

Share
Admin

Recent Posts