గుడ్డు ఆరోగ్యానికి మంచిదని చాలా మంది రోజూ గుడ్లు తీసుకుంటూ ఉంటారు. గుడ్డును తీసుకుంటే రకరకాల పోషక పదార్థాలు మనకి అందుతాయి. ప్రతి రోజూ అందుకే పిల్లలు, పెద్దలు కూడా గుడ్డును తీసుకుంటూ ఉంటారు. అయితే కొన్ని ఆహార పదార్థాలని తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కానీ కొన్ని ఆహార పదార్థాలను తీసుకుంటే ఆరోగ్యం పాడవుతుంది. అనవసరమైన ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. గుడ్డులో ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ వంటివి ఎక్కువగా ఉంటాయి.
గుడ్డులో కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువ ఉంటాయి. గుడ్డుని మనం వివిధ రకాలుగా తినొచ్చు. కానీ గుడ్డును తీసుకునేటప్పుడు ఈ ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి. లేదంటే మీరే నష్టపోతారు. గుడ్లతో పాటుగా పంది మాంసం తీసుకోకూడదు. రెండింట్లో కూడా ప్రోటీన్, కొవ్వు ఎక్కువ ఉంటుంది. రెండు కలిపి తీసుకుంటే మీరే అనవసరంగా ఇబ్బంది పడాలి. సో ఇలా వీటిని తీసుకోకండి.
గుడ్డు, పంచదార కలిపి తీసుకోవడం వలన అమైనో యాసిడ్స్ రిలీజ్ అయ్యి రక్తం గడ్డ కట్టడానికి దారితీస్తుంది. కాబట్టి గుడ్డు, చక్కెర కలిపి తీసుకోవద్దు. గుడ్డు, టీ కూడా కలిపి తీసుకోకూడదు. ఇలా చేయడం వలన మలబద్ధకం, అవయవాలకి తీవ్ర నష్టం కలుగుతాయి. గుడ్డు, సోయా మిల్క్ కలిపి తీసుకోవడం కూడా మంచిది కాదు. ఎందుకంటే రెండింట్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. ఈ రెండింటిని కలిపి తీసుకుంటే అనవసరంగా నష్టపోతారు.
అరటిపండు తిన్న వెంటనే గుడ్డు తినడం కూడా మంచిది కాదు. రెండింటిని తీసుకోవడానికి కొంచెం గ్యాప్ ఉండాలి. రెండూ వెంట వెంటనే తీసుకోవడం వలన శరీరానికి హాని కలుగుతుంది. ఎక్కువగా జిమ్ కి వెళ్లే వాళ్ళు ఈ పొరపాటు చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ కాంబినేషన్ తీసుకోకుండా చూసుకోవాలి. ఇలా ఈ ఆహార పదార్థాల మధ్య గ్యాప్ ఇస్తే మంచిది. లేకపోతే అనవసరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.