హెల్త్ టిప్స్

ఈ ఆహారాల‌ను తింటున్నారా ? అయితే త‌ల‌నొప్పిని క‌ల‌గ‌జేస్తాయి, జాగ్ర‌త్త‌..!

త‌ల‌నొప్పి అనేది మ‌న‌కు స‌హ‌జంగానే అప్పుడ‌ప్పుడు వ‌స్తుంటుంది. అందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. ఒత్తిడి అధికంగా ఉండ‌డం, శారీర‌క శ్ర‌మ ఎక్కువ‌గా చేయ‌డం.. వంటి ప‌లు కార‌ణాల వ‌ల్ల త‌ల‌నొప్పి వ‌స్తుంటుంది. అయితే మ‌నం తీసుకునే ఆహారాల వ‌ల్ల కూడా త‌ల‌నొప్పి వ‌స్తుంది. అందుక‌ని త‌ల‌నొప్పి త‌గ్గాలంటే ఆ ఆహారాల‌ను మానేయాల్సి ఉంటుంది. మ‌రి ఏయే ఆహారాల వ‌ల్ల త‌ల‌నొప్పి వ‌స్తుందంటే..

do not take these foods these will create headache

1. మ‌ద్యం సేవించ‌డం వ‌ల్ల శ‌రీరం డీహైడ్రేషన్‌కు గుర‌వుతుంది. శ‌రీరంలోని ద్ర‌వాలు త‌గ్గుతాయి. దీని వ‌ల్ల త‌ల‌నొప్పి వ‌స్తుంది.

2. కూల్ డ్రింక్స్‌, సోడాల‌ను తాగ‌డం వ‌ల్ల త‌ల‌తిర‌గ‌డం, జ్ఞాప‌క‌శ‌క్తిని కోల్పోవ‌డం వంటి స‌మ‌స్య‌ల‌తోపాటు త‌ల‌నొప్పి కూడా వ‌స్తుంద‌ని సైంటిస్టులు చేప‌ట్టిన అధ్య‌య‌నాలు వెల్ల‌డిస్తున్నాయి.

3. బేక‌రీ ప‌దార్థాల‌ను ఎక్కువ‌గా తిన‌డం వ‌ల్ల కూడా త‌ల‌నొప్పి వ‌స్తుంది. వాటిల్లో ఉప్పు, తీపి అధికంగా ఉంటాయి. ఇవి త‌ల‌నొప్పిని క‌ల‌గ‌జేస్తాయి.

4. సోయాసాస్ శ‌రీరానికి అస్స‌లు మంచిది కాదు. ఇందులో సోడియం అధికంగా ఉంటుంది. ఇది డీహైడ్రేష‌న్‌ను క‌ల‌గ‌జేస్తుంది. క‌నుక దీన్ని తిన్నా త‌ల‌నొప్పి వ‌స్తుంది. దీన్ని ఎక్కువ‌గా చైనీస్ ఫాస్ట్‌ఫుడ్‌లో వాడుతుంటారు. క‌నుక ఆ ఆహారాల‌ను తిన‌రాదు.

5. బ‌య‌ట చిరుతిళ్ల‌ను ఎక్కువ‌గా తిన్నా త‌ల‌నొప్పి వ‌స్తుంది. వాటిల్లో రుచి కోసం టేస్టింగ్ సాల్ట్‌ను వాడుతారు. దీన్నే మోనో సోడియం గ్లూట‌మేట్ అంటారు. ఇది శ‌రీరంలో ఎక్కువ‌గా చేరినా త‌ల‌నొప్పిని క‌ల‌గ‌జేస్తుంది.

6. అవ‌కాడోలు ఆరోగ్య‌క‌ర‌మైన‌వే. అయిన‌ప్ప‌టికీ వాటిల్లో థ‌యామిన్ అధికంగా ఉంటుంది క‌నుక అవ‌కాడోల‌ను ఎక్కువ‌గా తింటే త‌ల‌నొప్పి వ‌స్తుంది.

7. అర‌టి పండ్లు, చీజ్‌, చూయింగ్ గ‌మ్‌ల‌ను అతిగా తిన్నా త‌లనొప్పిని క‌ల‌గ‌జేస్తాయి.

Admin

Recent Posts