Tea : ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటుంటారు. అందుకని మంచి ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉంటారు. టీ తోపాటు వీటిని అస్సలు తీసుకోకూడదు. చాలా మంది టీ తీసుకునేటప్పుడు ఆహార పదార్థాలను కూడా తింటూ ఉంటారు. కానీ కొన్ని ఆహార పదార్థాలను టీ తోపాటు అసలు తీసుకోకూడదు. అలా చేయడం వలన సమస్య వస్తుంది. టీ తోపాటు ఫ్రోజెన్ ఫుడ్ ని తీసుకోవద్దు. టీ తో పాటు ఐస్ క్రీమ్, బఠానీ, స్వీట్ కార్న్ వంటి ఫ్రోజెన్ ఫుడ్ ని తీసుకోవద్దు. టీ కి, వీటికి మధ్య మూడు గంటల వరకు గ్యాప్ ఉండేటట్టు చూసుకోండి.
చాలా మంది వేడి వేడిగా పకోడీ లేదంటే బజ్జీ చేసుకుని టీ తోపాటుగా తీసుకుంటూ ఉంటారు. అలా చేయడం అస్సలు మంచిది కాదు. ఎప్పుడైనా ఫరవాలేదు. కానీ రోజూ ఇలా తీసుకోవడం వలన పేగుల్లో పుండ్లు కలుగుతాయి. పేగు క్యాన్సర్ వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. టీ తోపాటు పెరుగుతో చేసిన ఆహార పదార్థాలను తీసుకోకండి. ఇటువంటివి తీసుకోవడం వలన జీర్ణాశయంలో మంచి బ్యాక్టీరియా ఉత్పత్తి అవ్వదు.
బ్యాక్టీరియా నశించి సమస్య ఏర్పడుతుంది. కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. టీ తోపాటు నిమ్మరసం వంటివి తీసుకోవద్దు. అజీర్తి, మలబద్ధకం వంటి ఇబ్బందులు కలుగుతాయి. టీ తోపాటు పండ్లు కూడా తీసుకోకూడదు. ఐరన్ ఫుడ్ ని కూడా తీసుకోవద్దు.
టీ తోపాటు పసుపుని కూడా తీసుకోకండి. పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఎన్నో లాభాలను కలిగిస్తాయి. టీతోపాటు పసుపుని తీసుకోవడం వలన పసుపులోని గుణాలు పూర్తిగా నాశనం అయిపోతాయి. దాని వలన రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం వంటి సమస్యలు వస్తాయి. కనుక అనవసరంగా టీ తాగేటప్పుడు ఈ తప్పులు చేయొద్దు.