అందం అంటే ముందుగా గుర్తుకు వచ్చేది మహిళలే. ఎందుకంటే అందానికి వారు ఇచ్చే ప్రాధాన్యత పురుషులు కూడా ఇవ్వరు. అయితే ఈ రోజుల్లో ఆడ, మగ తేడా లేకుండా ప్రతి ఒక్కరు తమ ముఖ సౌందర్యాన్ని పెంచుకోవడం కోసం తపన పడుతున్నారనుకోండి. అది వేరే విషయం. ఈ క్రమంలో ఫేస్‌ప్యాక్‌లు, క్రీములు రాసుకోవడం, బ్యూటీ పార్లర్లకు, స్పాలకు వెళ్లడం కూడా ఎక్కువైపోయింది. కానీ వాటన్నింటికన్నా ఓ సింపుల్ ట్రిక్ ద్వారా ముఖాన్ని మరింత అందంగా కనిపించేలా చేసుకోవచ్చు. దీన్ని చైనా, జపాన్, కొరియా దేశాలకు చెందిన మహిళలు ఎప్పటి నుంచో ఉపయోగిస్తున్నారు. అదే వారి అందానికి ప్రధాన కారణంగా కూడా చెబుతున్నారు. ఇంతకీ ఆ ట్రిక్ ఏమిటో తెలుసా..? అదే స్పూన్ మసాజ్. అవును, మీరు విన్నది నిజమే, స్పూన్ మసాజే. దాంతో ముఖ సౌందర్యం ఎంతగానో పెరిగిపోతుందట.
స్పూన్ మసాజ్‌ను చేయడం వల్ల ముఖంపై ఉన్న ముడతలు తగ్గిపోయి ముఖం కాంతివంతంగా మారుతుందట. నిత్యం ఈ మసాజ్‌ను చేయడం వల్ల ముఖ సౌందర్యం మరింత పెరుగుతుందట. దీంతో వృద్ధాప్యం వచ్చినా ఎప్పటికీ యంగ్‌గానే కనిపిస్తారట. దీన్ని స్టార్ట్ చేసిన కొద్ది రోజులకే ఆశ్చర్యకరమైన మార్పులు వస్తాయట. ఈ క్రమంలో స్పూన్ మసాజ్ చేయడం ఎలాగో ఇప్పుడు చూద్దాం.
కొద్దిగా ఫేషియల్ మసాజ్ ఆయిల్‌ను ముఖంపై రాయాలి. అనంతరం ఓ చైనీస్ స్పూన్‌ను తీసుకుని ముఖంపై సున్నితంగా, మృదువుగా మసాజ్ చేయాలి. అయితే ఈ మసాజ్‌ను 10 నిమిషాల కన్నా ఎక్కువగా చేయకూడదు. లేదంటే అనుకున్న ఫలితాలు రావు.